న్యూస్

చస్…టాప్ 2 లేపేశాడు…ఇదీ మాస్ భీభత్సం అంటే!!

రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ రాధే శ్యామ్ టీసర్ యూట్యూబ్ లో సంచలన రికార్డులతో దుమ్ము దుమారం చేస్తూ దూసుకు పోతుంది, సినిమా టీసర్ 24 గంటలలో ఇప్పుడు టాలీవుడ్ తరుపున ఎవ్వరూ ఊహించని బెంచ్ మార్క్ ని సెట్ చేసింది…. ప్రీవియస్ టాలీవుడ్ రికార్డులను కేవలం 12 న్నర గంటల టైం కే బ్రేక్ చేసి సంచలనం సృష్టించిన ఈ టీసర్ ఇప్పుడు టాలీవుడ్ తరుపున ఫాస్టెస్ట్ 40 మిలియన్స్ వ్యూస్ మార్క్ ని…

అందుకున్న టీసర్ గా సంచలన రికార్డ్ ను అందుకోగా రెండు ఛానెల్స్ లో కలిపి ఇప్పుడు ఆల్ టైం టాప్ 2 రికార్డ్ హోల్డర్ అయిన సాహో టీసర్ రికార్డ్ ను బ్రేక్ చేసింది. సాహో టీసర్ అన్ని భాషల్లో కలిపి 24 గంటల్లో 44.5 మిలియన్స్ వరకు వ్యూస్ ని సొంతం చేసుకోగా…

ఇప్పుడు ఆ రికార్డ్ ను రాధే శ్యామ్ టీసర్ బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. ఇక కొత్త బెంచ్ మార్క్ ఎంత ఉంది అన్నది కొద్ది సేపట్లో తెలియబోతుండగా వ్యూస్ పరంగా సంచలన రికార్డులను నమోదు చేసినా లైక్స్ పరంగా మాత్రం ప్రీవియస్ రికార్డులలో సగం కూడా నమోదు కాకపోవడం కొంచం ఆశ్యర్యాన్ని కలిగిస్తుంది. మరి ఓవరాల్ గా 24 గంటల్లో ఎలాంటి రికార్డులు నమోదు అవుతాయో చూడాలి.

Leave a Comment