న్యూస్ బాక్స్ ఆఫీస్

చస్….సగం అవుట్…సూపర్ స్టారా…మజాకా!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి ల కాంబినేషన్ లో భారీ ఎత్తున తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో ఫస్ట్ డే ఇండస్ట్రీ రికార్డులతో బెండు తీసింది, కాగా సినిమా కొన్ని సెంటర్స్ లో ఊకందని కలెక్షన్స్ తో ఊచకోత కోసింది, భారీ ఎత్తున హైర్స్ కూడా ఉండటం తో సినిమా కి అవి కూడా కలిసి వచ్చాయి అని చెప్పాలి.

ఇక సినిమా రెండో రోజు సాధించిన కలెక్షన్స్ లెక్కలు తేలాల్సి ఉండగా ఓవరాల్ గా 2 రోజుల కలెక్షన్స్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించబోతుంది. ఇది నిజంగానే ఊచకోత అని చెప్పాలి. రిలీజ్ కి ముందు సినిమా టార్గెట్ 100 కోట్లు అని కన్ఫాం అవ్వగా…

భారీ పోటి లో ఈ మార్క్ ని అందుకోవడం అంత ఈజీ కాదని అంతా భావించారు. కానీ అందులో సగం టార్గెట్ ని ఇప్పుడు కేవలం 2 రోజుల్లోనే దాటేయ బోతుంది ఈ సినిమా. సినిమా రెండో రోజు వరల్డ్ వైడ్ గా అవలీలగా 10 కోట్లకు తగ్గని కలెక్షన్స్ ని అందుకోవచ్చు.

దాంతో 2 రోజుల టోటల్ కలెక్షన్స్ మినిమమ్ 53 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉంది. అంటే 100 కోట్ల టార్గెట్ లో 53% టార్గెట్ 2 రోజుల్లోనే రికవరీ చేయబోతుంది సరిలేరు నీకెవ్వరు సినిమా. ఇక సంక్రాంతి సెలవులు వారం మొత్తం కొనసాగుతాయి కాబట్టి మిగిలిన టార్గెట్ ని అందుకోవడం ప్రస్తుతానికి అయితే…

పెద్ద కష్టంగా కనిపించడం లేదని చెప్పాలి. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న సరిలేరు నీకెవ్వరు లాంగ్ రన్ లో టార్గెట్ ని అందుకోవడం పక్కా అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 2 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలు తేలాల్సి ఉంది. రిలీజ్ అయిన వెంటనే కలెక్షన్స్ అప్ డేట్ చేస్తాం…

Leave a Comment