న్యూస్ బాక్స్ ఆఫీస్

చస్….2 రోజుల్లో సగం అవుట్….స్టైలిష్ స్టార్ ఊచకోత!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠ పురం లో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోసిన విషయం తెలిసిందే, సినిమా తక్కువ థియేటర్స్ లోనే సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధించి అద్బుతమైన రికార్డులను నమోదు చేసి సంచలనం సృష్టించింది. ఇక సినిమా రెండో రోజు సోమవారం అయినా కానీ…

రెండు తెలుగు రాష్ట్రాలలో అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది, దాంతో సెలవు అయినా చాలా మందికి వర్కింగ్ డే అయినా కానీ సెన్సేషనల్ కలెక్షన్స్ ని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది అని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో…

సినిమా రెండో రోజు ఇప్పుడు అవలీలగా 9 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవడం పక్కా అంటున్నారు. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలు 10 కోట్లకు పైగానే మినిమమ్ ఉంటాయి. దాంతో రెండో రోజు కలెక్షన్స్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టార్గెట్ లో సగానికి పైగా రికవరీ చేయబోతుంది.

పోటిలో మరో స్టార్ హీరో సినిమా ఉండి ఏకంగా 85 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన అల వైకుంఠ పురం లో రెండు రోజులు పూర్తీ అయ్యే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర సగానికి పైగా బిజినెస్ ని రికవరీ చేయడం విశేషం అనే చెప్పాలి. ఇక సినిమా మూడో రోజు నుండి అసలు సిసలు…

సెలవులు మొదలు అవుతున్నాయి అందునా ఫ్యామిలీ ఆడియన్స్ ని సినిమా బాగా ఆకట్టుకుంటున్న నేపధ్యం లో ఈ వారం మొత్తం సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజులకు గాను సాధించిన అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు తేలాల్సి ఉన్నాయి.

Leave a Comment