న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

చస్…5 రోజుల్లో ఔట్…నంబర్ 1 తో ఊచకోత!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కంబ్యాక్ చేశాడు, కెరీర్ లో సరైనోడు తర్వాత క్లీన్ హిట్ కొట్టలేక పోయిన అల్లు అర్జున్ నా పేరు సూర్య ఫ్లాఫ్ తో భారీ గ్యాప్ నే తీసుకున్నాడు, ఈ గ్యాప్ లో పక్కా స్టొరీ ని సెలెక్ట్ చేసుకుని త్రివిక్రమ్ తో కలిసి సంక్రాంతి రేసులో అల వైకుంఠ పురం లో అంటూ వచ్చేయగా సినిమా బాక్స్ ఆఫీస్ ను అనుకున్నట్లు గానే షేక్ చేస్తుంది.

అది మాములుగా కాదు, బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు పక్కకు పెడితే మిగిలిన రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతీ రోజు హైయెస్ట్ షేర్ సాధించిన నాన్ బాహుబలి మూవీ గా రికార్డు సృష్టిస్తూ సినిమా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 74 కోట్ల మార్క్ ని అధిగమించాగా…

5 వ రోజు సినిమా సాధించే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 10 కోట్ల నుండి 10.5 కోట్ల రేంజ్ లో మినిమమ్ ఉండే చాన్స్ ఉండటం తో సినిమా ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకోబోతుందని చెప్పొచ్చు. బిజినెస్ ని క్రాస్ చేయడం ప్రస్తుతానికి పక్కగా కనిపిస్తుండగా…

ఫైనల్ లెక్కలను బట్టి బ్రేక్ ఈవెన్ పూర్తీ అయిందా లేదా అన్నది క్లియర్ గా తెలియనుంది. ఇక సినిమా 5 రోజులు పూర్తీ అయ్యే సరికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఆల్ టైం నంబర్ 1 షేర్ వసూల్ చేసిన సినిమా గా మొట్టమొదటి 80 కోట్ల షేర్ మూవీ గా నిలిచింది.

రిలీజ్ అయ్యి 5 రోజులే అవుతుండటం, ఇంకా మరో వీకెండ్ ఉండటం తర్వాత వారం కూడా కొత్త సినిమాలు లేకపోవడం తో ఈ సినిమా మరింత జోరు చూపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 5 రోజుల్లో సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలు రిలీజ్ అవ్వాల్సి ఉంది. రిలీజ్ అయిన వెంటనే అప్ డేట్ చేస్తాం….

Leave a Comment