న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

చస్….70 ఔట్…స్టైలిష్ స్టార్ మెంటల్ మాస్!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు, త్రివిక్రమ్ తో చేసిన జులాయి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలను మించే రేంజ్ లో అల వైకుంఠ పురం లో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోస్తూ దూసుకు పోతుంది, సినిమా 3 రోజుల్లో నే 61 కోట్ల మార్క్ ని అధిగమించి దుమ్ము దుమారం చేసిన విషయం తెలిసిందే, ఇక సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు మరో హాలిడే ఉండటం తో అల్టిమేట్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా మరో సారి 10 కోట్ల కి తగ్గని కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక సినిమా…

వరల్డ్ వైడ్ గా 11.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని మినిమమ్ అందుకోవచ్చని అంచనా వేస్తుండటం విశేషం అని చెప్పాలి. దాంతో ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 70 కోట్ల మార్క్ ని అధిగమించి ముందుకు దూసుకుపోనుంది. ఇది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో…

మూడో సారి 70 కోట్ల మార్క్ ని అందుకున్న సినిమాగా నిలవబోతుంది ఈ సినిమా. ఇది వరకు సరైనోడు మరియు దువ్వాడ జగన్నాథం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర 70 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించాయి, ఇక ఇప్పుడు అల వైకుంఠ పురం లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో 70 కోట్ల మార్క్ మూవీ గా నిలవబోతుంది.

ఇక సినిమా బిజినెస్ లో చాలా మొత్తాన్ని వెనక్కి తీసుకు వచ్చేయగా ఈ వీకెండ్ పూర్తీ అయ్యే సరికి బ్రేక్ ఈవెన్ తో పాటు లాభాలు కూడా భారీ లెవల్ లో సొంతం చేసుకోబోతుంది ఈ సినిమా. ఇక సినిమా మొత్తం మీద 4 రోజులకు గాను సాధించిన అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment