న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

చస్….80 ఔట్… సూపర్ స్టార్ ఊచకోత!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, సినిమా సంక్రాంతి సెలవుల అడ్వాంటేజ్ ని పోటి తీవ్రంగా ఉన్నా కానీ సాలిడ్ గా హోల్డ్ చేస్తూ దూసుకు పోతుంది, రెండు తెలుగు రాష్ట్రాలలో అల్టిమేట్ ట్రెండ్ తో దూసుకు పోతున్న సినిమా 4 రోజులు పూర్తీ అయ్యే సరికి టోటల్ గా 72 కోట్ల మార్క్ ని…

అధిగమించిన విషయం తెలిసిందే, ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు సాధించిన కలెక్షన్స్ లెక్కలు తేలాల్సి ఉండగా 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు సినిమా 4 వ రోజు కన్నా ఎక్కువ వసూళ్ళ ని సాధించ బోతుంది, మినిమమ్ లెక్క.. ఇప్పుడు…

9 కోట్ల నుండి 9.5 కోట్ల రేంజ్ లో ఉండబోతుందని సమాచారం. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 10 కోట్లకు పైగానే ఉండే అవకాశం ఎంతైనా ఉంది. ఇది నిజంగానే ఊచకోత అని చెప్పాలి. ఇక సినిమా 5 వ రోజు సాదించే కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా.. 80 కోట్ల మార్క్ ని అధిగమించబోతుంది.

ఇది మహేష్ కెరీర్ లో శ్రీమంతుడు, భరత్ అనే నేను మరియు మహర్షి సినిమాల తర్వాత 4 వ సారి అని చెప్పాలి. టాలీవుడ్ లో 4 సార్లు 80 కోట్లు కొట్టిన హీరోగా మహేష్ సంచలన రికార్డ్ ను నమోదు చేయబోతున్నాడు. ఇక వరుసగా హాట్రిక్ 80 కోట్ల షేర్ మార్క్ ని కూడా అందుకోబోతుండటం విశేషం అని చెప్పాలి.

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 100 కోట్ల టార్గెట్ లో భారీ మొత్తాన్ని వెనక్కి తీసుకురాగా ఇంకా సెలవులు ఉండటం వీకెండ్ కూడా ఉండటం తో సినిమా బ్రేక్ ఈవెన్ ని ఈ వారం లోనే అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజుల ఏరియాల వారి కలెక్షన్స్ రిపోర్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment