న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

చస్….90 ఔట్…టాలీవుడ్ చరిత్రలో ఒకేఒక్కడు!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అల్టిమేట్ ఫామ్ లో దూసుకు పోతున్నాడు, బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా ఫ్లాఫ్స్ ఎదురైనా తన దైన స్టైల్ లో భరత్ అనే నేను మరియు మహర్షి లతో బాక్ టు బాక్ హిట్స్ తో దుమ్ము లేపిన సూపర్ స్టార్ ఇప్పుడు చాలా టైం తర్వాత చేసిన మాస్ మూవీ సరిలేరు నీకెవ్వరు తో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేర్ చేస్తున్నాడు.

సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజుల్లోనే సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోయగా ఏకంగా 83 కోట్ల మార్క్ ని అధిగమించిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు కూడా అద్బుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోయింది, దాంతో సినిమా 6 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో…

ఏకంగా 90 కోట్ల మార్క్ ని అధిగమించి ముందుకు వెళ్ళగా టాలీవుడ్ చరిత్రలో పాన్ ఇండియా మూవీస్ ని పక్కకు పెడితే మూడు సార్లు 90 కోట్ల మార్క్ ని అధిగమించిన హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేశాడు. అన్ని సినిమాలను పరిశీలిస్తే… ముందుగా ప్రభాస్ ఈ మార్క్ ని అందుకున్నాడు.

ఇక్క సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రికార్డ్ ను పాన్ ఇండియా మూవీస్ కాకుండా కేవలం తెలుగు వర్షన్ మూవీస్ తోనే అందుకోవడం విశేషం అని చెప్పాలి. ఇక సినిమా త్వరలోనే 100 కోట్ల మార్క్ ని కూడా అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అది కూడా రికార్డ్ అనే చెప్పాలి.

బాక్ టు బాక్ 100 కోట్ల షేర్ మూవీస్ తో మరో అల్టిమేట్ రికార్డు ను నమోదు చేయబోతున్నాడు మహేష్ బాబు. బాక్స్ ఆఫీస్ దగ్గర సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి సెలవుల అడ్వాంటేజ్ ని ఓ రేంజ్ లో వాడుకుంటుంది, ఇక సినిమా 6 వ రోజు టోటల్ కలెక్షన్స్ లెక్కలు రిలీజ్ అవ్వాల్సి ఉంది. రిలీజ్ అయిన వెంటనే అప్ డేట్ చేస్తాం,….

Leave a Comment