న్యూస్ బాక్స్ ఆఫీస్

చాణక్య షాకింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్…డే 2 స్టేటస్…ఏం షాక్ సామి ఇది!!

లౌక్యం తర్వాత మళ్ళీ అలాంటి విజయం కోసం ఎదురు చూస్తున్న యాక్షన్ హీరో గోపీచంద్ దసరా ని టార్గెట్ చేసి అలాంటి విజయం ఆశిస్తూ రిలీజ్ చేసిన సినిమా చాణక్య. బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టాక్ మొదటి ఆటకే యావరేజ్ లెవల్ లో రాగా కలెక్షన్స్ పరంగా కూడా అంతంతమాత్రమే కలెక్షన్స్ ని సాధిస్తూ పండగ సెలవుల అడ్వాంటేజ్ మొత్తాన్ని వృధా చేసుకుంటుంది.

తొలిరోజు సినిమా 1.5 కోట్ల రేంజ్ లో అయినా వరల్డ్ వైడ్ షేర్ ని వసూల్ చేస్తుంది అనుకున్నా సినిమా కేవలం 1.1 కోట్ల రేంజ్ కే పరిమితం అయ్యి షాక్ ఇచ్చింది. అందులో రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా కేవలం 1 కోటి లోపే షేర్ ని అందుకుని షాక్ ఇచ్చింది.

టోటల్ గా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి
👉Nizam: 28L
👉Ceeded: 16L
👉UA: 16L
👉East: 9L
👉West: 7L
👉Guntur: 7.5L
👉Krishna:7.4L
👉Nellore: 6L
AP-TG Day 1:- 0.97Cr
Ka&ROI: 6L
OS: 7L
Total: 1.10Cr(1.7Cr Gross) ఇదీ మొత్తం మీద సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్.

సినిమా ను టోటల్ గా 11 కోట్లకు పైగా రేటుకి అమ్మారు, 12 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 10.9 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధిస్తేనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంటుంది. దసరా సెలవులు ఆదివారం నుండి 4 రోజులు నాన్ స్టాప్ గా ఉండగా…

సినిమా ఇకెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ మొదటి రోజు తో పోల్చితే ఆల్ మోస్ట్ 40% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకున్నాయి. దాంతో రెండో రోజు సినిమా ఎదైనా అద్బుతం జరిగితే తప్పితే 50 లక్షల రేంజ్ లోనే షేర్ ని బాక్స్ ఆఫీస్ బరిలో అందుకోవచ్చని అంటున్నారు.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!