న్యూస్ రివ్యూ

చావు కబురు చల్లగా రివ్యూ…హిట్టా-ఫ్లాఫా!!

యంగ్ హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ చావు కబురు చల్లగా, లావణ్య త్రిపాటి, ఆమని, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగర్ లాంటి మంచి స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం తో మంచి హైప్ నే సొంతం చేసుకుంది, మరి సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చింది కాబట్టి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది, ఎంతవరకు ఆకట్టుకుందో లాంటి వివరాలను గమనిస్తే..

ముందుగా కథ పాయింట్ కి వస్తే… చనిపోయిన వాళ్ళని తీసుకెళ్ల స్వర్గపురి వాహనం నడిపే హీరో, అనుకోకుండా ఒక ఒక మృతదేహం తీసుకెళ్ళే టైం లో భర్త చనిపోయిన హీరోయిన్ లావణ్య చూసి మొదటి చూపులోనే ఇష్టపడతాడు. తర్వాత ఏం జరిగింది, హీరోయిన్ ని ఒప్పించాడా లేదా… ఆమని రోల్ ఏంటి లాంటి విశేషాలు అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

కథ పాయింట్ ఎంత చిన్నది అంటే, సింగిల్ లైన్ లో స్టొరీ మొత్తం చెప్పెయవచ్చు, హీరో హీరోయిన్ ని చూసి ఇష్టపడటం, ప్రేమించమని వెంటపడటం, హీరోయిన్ నో చెప్పడం, ఎలాగోలా క్లైమాక్స్ లో కలవడం లాంటి కథలు ఎన్నో ఎన్నో చూసి చూసి ఉన్నాం, ఇక్కడ కూడా ఒకే కథ కానీ బ్యాగ్రాప్ మాత్రం స్వర్గపురి వాహనం నడిపే హీరో అండ్ భర్త చనిపోయిన నర్స్ అయిన హీరోయిన్ గా పెట్టి…

సినిమా కొత్త కథలా అనుకున్నారు కానీ ట్రీట్ మెంట్ మాత్రం రొటీన్ గానే ఉంది, ఉన్నంతలో ఆమని రోల్ సెకెండ్ ఆఫ్ లో ఎంటర్ అయ్యి బాగా ఆకట్టుకోగా, హీరో హీరోయిన్ సెకెండ్ ఆఫ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ పర్వాలేదు అనిపించాయి. ఫస్టాఫ్ సిల్లీగా అనిపించినా పర్వాలేదు అనిపించే విధంగా ఎంటర్ టైన్ చేస్తుంది, కార్తికేయ తన పెర్ఫార్మెన్స్ వరకు అదరగొట్టేశాడు. తన రోల్ మాస్ గా బాగానే ఆకట్టుకోగా, లావణ్య త్రిపాటి ఓకే అనిపిస్తుంది.

మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగర్ ల రోల్స్ పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా సినిమాకి సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయ్యాయి, ఎడిటింగ్ చాలా వీక్ గా ఉండగా స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ పర్వాలేదు కానీ సెకెండ్ ఆఫ్ నీరసంగా సాగుతుంది, సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే… కౌశిక్ రొటీన్ లవ్ స్టొరీ ని…

డిఫెరెంట్ బ్యాగ్రాప్ ని ఎంచుకుని ఫస్టాఫ్ వరకు పర్వాలేదు అనిపించినా సెకెండ్ ఆఫ్ లో మాత్రం చేతులు ఎత్తేశాడు, సినిమా చాలా స్లో గా, ఫ్లో తప్పి నీరసంగా సాగుతుంది సెకెండ్ ఆఫ్ లో, ఫస్టాఫ్ లో ఎంటర్ టైన్ మెంట్ అయినా ప్లస్ అయింది కానీ సెకెండ్ ఆఫ్ లో చాలా సీన్స్ ఫ్లాట్ గా ఉంటాయి, ఏమాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా అనిపించవు…

ఫస్టాఫ్ ఉన్నంత ఎంటర్ టైన్ మెంట్ అయినా సెకెండ్ ఆఫ్ లో ఉండి ఉంటె సినిమా ఇంకొంచం ఎక్కువ ఇంప్రెస్ చేసి ఉండేది, ఓవరాల్ గా సినిమా కొంచం కష్టం అయినా ఒకసారి చూడొచ్చు… గీత ఆర్ట్స్ 2 బ్యానర్ నుండి ఇది వరకు వచ్చిన మూవీస్ రేంజ్ లో అయితే ఈ సినిమా లేదనే చెప్పాలి. సినిమా మా ఫైనల్ రేటింగ్ 2.5 స్టార్స్

Leave a Comment