న్యూస్ బాక్స్ ఆఫీస్

చిత్రలహరి డే 2 కలెక్షన్స్…ఊచకోత!!

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 వరుస ఫ్లాఫ్స్ పడ్డా కానీ మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని తొలిరోజు ఓవరాల్ గా 4.2 కోట్లకి పైగా షేర్ ని అందుకుని సత్తా చాటుకుంది, ఇక సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్బుతంగా హోల్డ్ చేసింది, అన్ని ఏరియాల్లో ఆన్ లైన్…

టికెట్ సేల్స్ అద్బుతంగా ఉండగా మొదటి రోజు తో పోల్చితే డ్రాప్స్ కేవలం 30 – 35% వరకు మాత్రమె ఉన్నాయని చెప్పాలి, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు పూర్తిగా తేలాల్సి ఉండగా  ఈవినింగ్ అండ్ నైట్ షోల కి సినిమా కి IPL మ్యాచుల నుండి ఇబ్బంది ఎదురు…

అయ్యే అవకాశం ఉండటం తో ఎంతవరకు బుకింగ్స్ తో హోల్డ్ చేసింది అన్నది తెలియాల్సి ఉన్నా కానీ, ఆన్ లైన్ టికెట్ సేల్స్ లెక్కల్లో మాత్రం సినిమా 2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని రెండు రాష్ట్రాలలో అందుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి, ఇక సినిమా ఆఫ్ లైన్ లెక్కలు కూడా బాగుంటే…

ఈ లెక్క 2.4 కోట్ల వరకు వెళ్ళే అవకాశం మించే చాన్స్ కూడా ఉందని చెప్పాలి. మొత్తం మీద వరుస ఫ్లాఫుల్లో ఉన్న సాయి ధరం తేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎబో యావరేజ్ మూవీ తో దుమ్ము లేపే ఓపెనింగ్స్ ని సొంతమ్ చేసుకుంటూ ఊచకోత కోస్తున్నాడు.

ఇక సినిమా ఆదివారం కలెక్షన్స్ పరంగా కూడా ఇదే విధంగా దుమ్ము లేపితే కచ్చితంగా బ్రేక్ ఈవెన్ కి మరింత చేరువగా వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి, ఇక 2 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!