న్యూస్

చిన్న సినిమా అన్నారు…24 గంటల్లో స్టార్ మూవీస్ రేంజ్ లో రికార్డులు!

అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలకు కూడా రెస్పాన్స్ సాలిడ్ గా వస్తూ ఉంటుంది, యూట్యూబ్ లో రిలీజ్ అయ్యే టీసర్ లు ట్రైలర్ లకు ఆడియన్స్ రెస్పాన్స్ సాలిడ్ గా దక్కుతూ ఉంటుంది… ఇప్పుడు ఇలాంటిదే యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ గల్లీ రౌడీ కి సొంతం అయ్యింది అని చెప్పాలి. సందీప్ కిషన్ నటించిన ఈ లేటెస్ట్ మూవీ ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం రిలీజ్ కానుంది.

కాగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు… ట్రైలర్ లో సినిమా కథ ని చాలా వరకు చెప్పినా కథ పాయింట్ తమిళ్ నుండి తెలుగు లోకి డబ్ అయిన విజయ్ సేతుపతి నయనతార ల కాంబినేషన్ లో వచ్చిన….

నేను రౌడీనే సినిమా ను పోలి ఉంది… హీరోయిన్ కి ఒక ప్రాబ్లం, ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ఒక రౌడీ హెల్ప్ కావాలి అంటుంది, ఫ్యామిలీ రౌడీ బిజినెస్ ను మెయిన్ టైన్ చేస్తున్న హీరో ఆమె ప్రాబ్లం ను సాల్వ్ చేసే క్రమంలో ఎదురుకున్న అవరోధాలు ఏంటి…

అనేది సినిమా ఓవరాల్ కాన్సెప్ట్…. నేను రౌడీనే సినిమా కాన్సెప్ట్ కూడా ఇదే విధంగా ఉంటుంది… మరి ఇక్కడ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ ట్రైలర్ కి షాకింగ్ అనిపించే రేంజ్ లో యూట్యూబ్ లో సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కింది. వ్యూస్ రియల్ టైం వి 5.5 మిలియన్ మార్క్ ని అందుకుంటే అప్ డేట్ అయిన వ్యూస్ 5.07 మిలియన్ మార్క్ ని…

24 గంటల్లో సొంతం చేసుకోగా లైక్స్ 50 వేల లైక్స్ ని అందుకుంది 24 గంటల్లో..వ్యూస్ యూట్యూబ్ లో యాడ్స్ ద్వారా పెంచుకున్నారు కానీ ఓవరాల్ గా రికార్డ్ రికార్డే కాబట్టి 24 గంటల్లో స్టార్స్ కి వచ్చే రేంజ్ రెస్పాన్స్ ను సినిమా సొంతం చేసుకుందని చెప్పాలి. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు అంచనాలను అందుకుని పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇక.

Leave a Comment