న్యూస్ బాక్స్ ఆఫీస్

చిన్న సినిమా అన్నారు…4.5 కోట్లకు టోటల్ ప్రాఫిట్ తెలిస్తే మైండ్ బ్లాంక్!!

యు వి క్రియేషన్ బ్యానర్ కి ఉన్న వాల్యూ దృశ్యా చిన్న సినిమానే అయినా కానీ ఏక్ మినీ కథ సినిమా ఓవరాల్ గా సెన్సేషనల్ బిజినెస్ ను సొంతం చేసుకుని మేకర్స్ కి అల్టిమేట్ ప్రాఫిట్స్ ను సొంతం అయ్యేలా చేసింది, సినిమా రీసెంట్ గా తెలుగు శాటిలైట్ రైట్స్ తో పాటు హిందీ డబ్బింగ్ రైట్స్ ని కూడా అమ్మేశారని టాలీవుడ్ లో స్ట్రాంగ్ గా వార్తలు శిఖారు చేస్తున్నాయి.

సినిమా ను ముందు సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకు రావాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా సినిమా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన థియేటర్స్ లో రిలీజ్ ను కాకుండా ఆడియన్స్ ముందుకు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంది.

కాగా సినిమా మొత్తం మీద 4.5 కోట్ల లోపు బడ్జెట్ లో రూపొందగా అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఏకంగా 9.15 కోట్ల రేటు చెల్లించి హక్కులను తీసుకున్నారని లేటెస్ట్ న్యూస్. ఇక సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ద్వారా 3.3 కోట్ల రేటు సొంతం అయ్యిందని సమాచారం. ఇక రీసెంట్ గా సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా…

అమ్ముడు పోయాయని అంటున్నారు. హిందీ డబ్బింగ్ రైట్స్ ని 2.5 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారని అంటున్నారు. దాంతో టోటల్ గా సినిమా బిజినెస్ ఇప్పుడు 14.95 కోట్ల మార్క్ ని అందుకుందని చెప్పొచ్చు. మ్యూజిక్ రైట్స్ కింద ఓ 25 లక్షల రేటు సొంతం అయ్యిందని అంటున్నారు కానీ క్లారిటీ లేదు….ఆ రేటే ఫైనల్ అనుకుంటే… టోటల్ బిజినెస్ 15.20 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుందని చెప్పొచ్చు.

అందులో సినిమా బడ్జెట్ 4.5 కోట్లు పక్కకు పెడితే సినిమా ద్వారా నిర్మాతలకు అవలీలగా 10.7 కోట్ల రేంజ్ లో లాభం సొంతం అయ్యిందని చెప్పొచ్చు. ఓ చిన్న సినిమా ఈ రేంజ్ లో బిజినెస్ ను లాభాలను సొంతం చేసుకోవడం అంటే మాములు విషయం కాదనే చెప్పాలి. ఇక సినిమా ఆడియన్స్ ను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి ఇక..

Leave a Comment