టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

చిన్న సినిమా…డబుల్ బ్లాక్ బస్టర్…రాజ రాజ చోర టోటల్ కలెక్షన్స్!

బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ వేవ్ తర్వాత రిలీజ్ అయిన మూవీస్ లో యునానిమస్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమా శ్రీ విష్ణు నటించిన రాజ రాజ చోర సినిమా.. ఈ సినిమా కి ముందు శ్రీ విష్ణు నటించిన సినిమాలు ఫ్లాఫ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నా కానీ ఈ సినిమా మీద పెద్దగా అంచనాలు లేకుండా ఉండటం తో సినిమాను ముందు డిజిటల్ లో రిలీజ్ చేయాలి అనుకున్నా కానీ…

తర్వాత ఔట్ పుట్ పై నమ్మకంతో థియేటర్స్ లోనే సినిమాను రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యి సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకు రాగా, మొదటి ఆటకే హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా లాంగ్ రన్ ని దక్కించుకుని సెకెండ్ వేవ్ తర్వాత…

ఎక్కువ టైం థియేటర్స్ లో ఉన్న సినిమాగా సంచలనం సృష్టించింది. టోటల్ రన్ లో బిజినెస్ మీద ఊహకందని ప్రాఫిట్ ను కూడా సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డబుల్ బ్లాక్ బస్టర్ ప్లస్ గా పరుగును కంప్లీట్ చేసుకుంది. సినిమా టోటల్ కలెక్షన్స్ లెక్క ని ఒకసారి గమనిస్తే….

👉Nizam: 2.18Cr
👉Ceeded: 82L
👉UA: 72L
👉East: 43L
👉West: 24L
👉Guntur: 47L
👉Krishna: 26L
👉Nellore: 18L
Total AP TG: 5.30CR(9.10cr~ Gross)
👉KA+ROI: 17L
👉OS: 75L~
TOTAL Collections: 6.22CR(11.15CR~ Gross)
ఇదీ సినిమా టోటల్ రన్ లో సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్ లెక్క అని చెప్పాలి. పోటి లో కూడా సినిమా…

లాంగ్ రన్ ని ఆల్ మోస్ట్ 30 రోజుల పాటు కొనసాగించింది. సినిమాను 2.2 కోట్లకు అమ్మగా 2.4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో సాధించిన 6.22 కోట్ల కలెక్షన్స్ తో 3.82 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఊచకోత కోసింది. వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న శ్రీ విష్ణు కి బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ మూవీ లా నిలిచింది ఈ సినిమా..

Leave a Comment