గాసిప్స్ న్యూస్

చిన్న సినిమా డబుల్ రేటు తో డీల్ క్లోజ్…రిలీజ్ ఎప్పుడంటే!

రీసెంట్ టైం లో పెద్ద సినిమాల కన్నా చిన్న సినిమాలే సేఫ్ జోన్ లో నిలుపుతున్న సినిమాలు గా నిలుస్తున్నాయి. కొంచం టాక్ ఉంటే చాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ వస్తాయి. ఒకటి రెండు సాంగ్స్ హిట్స్ అయితే చాలు డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ కూడా బాగా పలుకుతాయి. ఇలా ఈ ఇయర్ కొన్ని చిన్న సినిమాలు ఊహించని విజయాలను నమోదు చేసి సత్తా చాటుకున్నాయి.

ఇప్పుడు శ్రీ విష్ణు హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ రాజ రాజ చోర సినిమా ట్రైలర్ ఆడియన్స్ ను బాగానే మెప్పించింది అని చెప్పాలి. కొత్త కాన్సెప్ట్ తో శ్రీ విష్ణు ట్రై చేసిన ఈ డిఫెరెంట్ మూవీ కి మంచి బజ్ ఏర్పడగా సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అనుకున్నా…

త్వరలో వరుస పెట్టి సినిమాల మధ్య పోటి పెరిగే అవకాశం ఎంతైనా ఉన్న నేపధ్యంలో ఈ సినిమా ను ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ చేయించడం కన్ఫాం అయింది. రీసెంట్ టైం లో బ్రోచేవారెవరురా తర్వాత పెద్దగా హిట్స్ లేక పోయినా కానీ ఆ ఇంపాక్ట్ ఈ సినిమా పై…

ఏమాత్రం పడకపోగా సాలిడ్ రేటు కే సినిమా డిజిటల్ రైట్స్ ని అమ్మారు. సినిమాను మొత్తం మీద 3 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించగా సినిమా కి డిజిటల్ రిలీజ్ కోసం ముందు 5.2 కోట్ల ఆఫర్ తర్వాత 6 కోట్ల దాకా ఆఫర్ వచ్చింది. ఫైనల్ డీల్ 6.2 కోట్ల రేటు కి ఫిక్స్ చేశారని ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

అంటే పెట్టిన 3 కోట్ల బడ్జెట్ కి సినిమా కి ఆల్ రెడీ డబుల్ ప్రాఫిట్ డిజిటల్ రైట్స్ ద్వారా సొంతం అయ్యింది అని చెప్పోచ్చు. థియేటర్స్ లో రిలీజ్ అయినా కానీ ఇంత బిజినెస్ జరగడం కష్టమే అని చెప్పాలి. ఆ లెక్కన అద్బుతమైన డీల్ తో సినిమా డిజిటల్ రిలీజ్ ను ఇప్పుడు ఆగస్ట్ 15 న జీ 5 లో సొంతం చేసుకోబోతుందని సమాచారం.

Leave a Comment