న్యూస్ బాక్స్ ఆఫీస్

చిన్న సినిమా….పాజిటివ్ టాక్ పవర్……టాప్ 10 ప్లేస్…..మాస్!

రీసెంట్ గా రిలీజ్ అయిన డైరెక్ట్ రిలీజ్ మూవీస్ లో అన్ని సినిమాలలోకి అతి చిన్న సినిమా గతం అని చెప్పాలి. అసలు ఏమాత్రం పరిచయం లేని ఆర్టిస్టులతో తెరకెక్కిన ఈ సినిమా క్వాలిటీ పరంగా మాత్రం టాప్ నాట్చ్ అనిపించే విధంగా ఉండగా ఎక్కువ శాతం షూటింగ్ అమెరికా లోనే జరగడం తో విజువల్స్ అద్బుతంగా వచ్చాయి, క్రైం కం సైకో థ్రిల్లర్ జానర్స్ లో తెరకెక్కిన ఈ సినిమా…

చాలా సైలెంట్ గా రిలీజ్ అవ్వగా చూసిన ప్రతీ ఒక్కరు కూడా సినిమాను ఓ రేంజ్ లో పొగడం మొదలు పెట్టగా సోషల్ మీడియా లో పాజిటివ్ టాక్ అంతటా స్ప్రెడ్ అయ్యింది. దాని ఫలితం సినిమా కి సాలిడ్ గా వ్యూస్ దక్కడం మొదలు పెట్టగా సినిమాకి ఆదరణ భారీగా పెరిగింది.

కాగా OTT ప్లాట్ ఫామ్స్ లో గడచిన రెండు వారాలుగా హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకుంటూ సాలిడ్ గా జోరుని కొనసాగిస్తున్న టాప్ 10 మూవీస్/సిరీస్ లలో ఈ సినిమా 10 వ ప్లేస్ ని ఇండియా లో సొంతం చేసుకోవడం విశేషం అనే చెప్పాలి.

ఒకసారి టాప్ 10 మూవీస్/సిరీస్ లను గమనిస్తే
– Soorarai Pottru.
– Laxmii.
– Ludo.
– Mirzapur S2.
– Tom and Jerry – The Movie.
– The Mandalorian S2.
– Scam 1992.
– Colour Photo.
– The Queen’s Gambit.
– Gatham
మొదటి ప్లేస్ లో సూర్య సూరరై పోట్రు నిలవగా రెండో ప్లేస్ లో లక్ష్మీ సినిమా నిలిచింది… మిగిలినవి సిరీస్ లు హాలీవుడ్ మూవీస్ ఉండగా….

టాలీవుడ్ తరుపున కలర్ ఫోటో 8 వ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ ఉండగా 10 వ ప్లేస్ లో చిన్న సినిమా గతం సినిమా నిలిచింది, కలర్ ఫోటో సినిమా కూడా చిన్న సినిమానే అయినా పెద్ద విజయం అందుకోగా, అసలు ఎవరికీ పరిచయం లేని గతం లాంటి చిన్న సినిమా సాలిడ్ వ్యూస్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం అనే చెప్పాలి.

Leave a Comment