న్యూస్ బాక్స్ ఆఫీస్

చిన్న సినిమా…మా వింత గాధ వినుమా…బిజినెస్ అండ్ ఫస్ట్ వీక్ వ్యూస్ లెక్కలు ఇవే!!

సిద్ధూ జొన్నలగడ్డ సీరత్ కపూర్ ల కాంబినేషన్ లో కృష్ణ అండ్ హిస్ లీలా సినిమా తర్వాత రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు మరోసారి డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్న సినిమా మా వింత గాధ వినుమా సినిమా ఆహా వీడియో లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. కాగా సినిమా పార్ట్ పార్టులుగా ఆకట్టుకునే విధంగానే ఉన్నా కానీ కథ లో దమ్ము పెద్దగా లేకపోవడంతో సినిమా…

మొత్తం మీద మెప్పించలేకపోయింది. అయినా కానీ కొంచం ఎంటర్ టైన్ మెంట్ ఉండటంతో సినిమా లెంత్ తక్కువే అయినా జనాలు ముఖ్యంగా యూత్ సినిమాను బాగానే చూశారు ఆహా యాప్ లో. సినిమా కి సంభందించిన మొదటి వారం లెక్కలు ఇప్పుడు ట్రేడ్ లో చక్కర్లు కొడుతున్నాయి.

ఆ లెక్కల ప్రకారం సినిమాకి మంచి వ్యూస్ ఆహా యాప్ లో దక్కాయి అని చెప్పాలి. సినిమా ను ఆహా యాప్ వాళ్ళు సుమారు 1.6 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక మొదటి రోజు 80 వేల యూనిక్ వ్యూస్ ని… వీకెండ్ లో 1 లక్షలా 70 వేల యూనిక్ వ్యూస్ ని…

సినిమా సొంతం చేసుకోగా మొదటి వారం ముగిసే సరికి మొత్తం మీద 2 లక్షల 40 వేల దాకా యూనిక్ వ్యూస్ ని సినిమా సొంతం చేసుకుందని అంటున్నారు. చిన్న సినిమాకి ఇవి మంచి వ్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ వ్యూస్ కి సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని సాధించి ఉండొచ్చు అనేది అంచనా వేసి చూస్తె… ఆహా వీడియో…

ఒక నెల రేటు 50 ని టికెట్ రేటుగా భావిస్తే 2 లక్షల 40 వేల వ్యూస్ కి 1.2 కోట్ల రేంజ్ లో రెవెన్యూ ని సినిమా సొంతం చేసుకుని ఉంటుందని అంచనా వేయవచ్చు. అంటే ఈ లెక్కన అప్ కమింగ్ వీక్స్ లో OTT లో సాధించిన బిజినెస్ ని రికవరీ చేసి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Leave a Comment