గాసిప్స్ న్యూస్

చిన్న సినిమా….మూడున్నర రెట్ల మాస్ ఆఫర్…కానీ షాకిచ్చారు…డేట్ చెప్పారు!

రీసెంట్ టైం లో చిన్న సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రిజల్ట్ లు రావడం తో కొన్ని క్రేజ్ ఉన్న సినిమాలకు మంచి మంచి ఆఫర్స్ వస్తూ ఉన్నాయి. లేటెస్ట్ గా సాంగ్స్ తో సూపర్ పాపులర్ అయ్యి సినిమా పై మంచి ఆసక్తి ని క్రియేట్ అయ్యేలా చేసి ట్రైలర్ తో మరింతగా ఆకట్టుకున్న చిన్న సినిమా SR కళ్యాణ మండపం. సాంగ్స్ సూపర్ హిట్ గా నిలవడం తో…

పాండమిక్ టైం లోనే సినిమా కి థియేట్రికల్ బిజినెస్ ఆల్ మోస్ట్ అన్ని ఏరియాల్లో కన్ఫాం అయినట్లు అయింది, కానీ ఇతర సినిమాల మాదిరిగా ఈ సినిమా కి కూడా డిజిటల్ లో రిలీజ్ కి ట్రై చేసి డీసెంట్ రేట్ల నుండి ఊహించని రేట్లు కూడా ఆఫర్ చేశారు.

కానీ అన్నింటికీ నో చెబుతూ వచ్చిన టీం థియేట్రికల్ రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తూ ఉన్నా రేటు ని పెంచుతూ 6 కోట్లు, 6.5 కోట్ల దాకా కూడా వెళ్ళగా రీసెంట్ గా థియేట్రికల్ రిలీజ్ ను సినిమా కన్ఫాం చేసుకున్నా చివరి ప్రయత్నంగా మరోసారి రేటు పెంచి 7 కోట్ల రేటుకి…

సినిమా డిజిటల్ లో రిలీజ్ చేయించాలని ట్రై చేశారు. సినిమా బడ్జెట్ పబ్లిసిటీ ఖర్చులతో కలిపి 2 కోట్ల రేంజ్ లో ఉండగా ఆల్ మోస్ట్ మూడున్నర రెట్లు అధికంగా డిజిటల్ రిలీజ్ ఆఫర్ వచ్చినా నో చెప్పి ఇప్పుడు సినిమా రిలీజ్ ను కన్ఫాం చేసి సినిమా ఆడియన్స్ ముందుకు ఆగస్టు 6 న రిలీజ్ కాబోతుంది అంటూ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ తో కన్ఫాం చేశారు.

మూడున్నర రెట్ల ఆఫర్ కు నో చెప్పి సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయడానికి సిద్ధం అయ్యారు అంటే సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్స్ ఉందని చెప్పొచ్చు. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు అంచనాలను తట్టుకుని నిలబడుతుంది ఈ ఆఫర్ లకి మించి కలెక్షన్స్ ఎంతవరకు0 కలెక్ట్ చేయగలుగుతుందో చూడాలి ఇక…

Leave a Comment