న్యూస్ బాక్స్ ఆఫీస్

జాతిరత్నాలు బ్లాక్ బస్టర్…ఇప్పుడు నవీన్ పాలిశెట్టి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ లో బ్యాగ్రౌండ్ ఉన్న వాళ్ళే ఎక్కువ సక్సెస్ అవుతారు అన్న అపవాదు ఉంది, కానీ ఇది ఏమాత్రం నిజం కాదని, రీసెంట్ టైం లో చాలా మంది హీరోలు ఎలాంటి స్టార్ బ్యాగ్రౌండ్ లేకుండా కూడా సూపర్ సక్సెస్ అవుతున్నారు, కానీ కొంచం టైం పడుతుంది అనే చెప్పాలి. అలాంటి వాళ్ళలో ఇప్పుడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా ఒకరు అని చెప్పొచ్చు. కెరీర్ ను సైడ్ రోల్స్ తో…

మొదలు పెట్టి తర్వాత బాలీవుడ్ లో షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయ్యి తర్వాత చిచోరే సినిమా తో మరింత పాపులారిటీని సొంతం చేసుకోగా అదే టైం లో తెలుగు లో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసిన నవీన్ పోలిశెట్టి…

ఆ సినిమా తో సూపర్ సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు, ఇక తర్వాత కొత్త సినిమా జాతిరత్నాలు బాక్స్ ఆఫీస్ దగ్గర హ్యుమంగస్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి నవీన్ కి సాలిడ్ క్రేజ్ వచ్చేలా చేసింది, హీరోగా చేసిన రెండో సినిమా కే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తో…

సాలిడ్ క్రేజ్ ను సొంతం చేసుకున్న నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు సినిమా కి 50 లక్షల రేంజ్ లో రెమ్యునరేషన్ ని మాత్రమే తీసుకున్నాడు, తర్వాత ప్రాఫిట్స్ ఎక్కవ రావడం తో ప్రొడ్యూసర్ బోనస్ కూడా గట్టిగా ఇచ్చారని సమాచారం. జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇప్పుడు నవీన్ పోలిశెట్టి అనుష్క తో కలిసి ఒక సినిమా చేయబోతున్నాడు. డిఫెరెంట్ కాన్సెప్ట్ తోనే వస్తున్న..

ఈ సినిమా కి గాను రెమ్యునరేషన్ 2.5 కోట్ల కి పెంచాడట… ఇక లాభాలు వస్తే కొంచం ప్రాఫిట్ షేర్ కూడా ఉంటుందని సమాచారం. మూడో సినిమా కే మీడియం రేంజ్ హీరోల లెవల్ కి చేరి ఏకంగా 2.5 కోట్ల రెమ్యునరేషన్ ను అందుకునే రేంజ్ కి ఎదిగిన నవీన్ పోలిశెట్టి ఫ్యూచర్ లో మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

Leave a Comment