న్యూస్ బాక్స్ ఆఫీస్

జాను కలెక్షన్స్: ఫస్ట్ డే 1.5 కోట్లు అనుకుంటే వచ్చింది ఇది!!

శర్వానంద్ సమంత ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జాను, బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా కి ఆడియన్స్ నుండి యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తుంది కానీ సినిమా స్లో గా ఉందన్న కంప్లైంట్ కూడా ఉంది. అయినా కానీ క్లాస్ మూవీస్ ఇష్టపడే వారు సినిమా ను బాగానే మొదటి రోజు చూశారు. సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా అంచనాలను…

మించి పోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ రోజు మొదటి రెండు మూడు షోలు సాధారణంగా నే హోల్డ్ చేయగా సమ్మక్క సారక్క జాతర వలన కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో రావని ట్రేడ్ వర్గాలు ఫిక్స్ అయ్యాయి.

మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 1 కోటి రేంజ్ లో షేర్ ని, వరల్డ్ వైడ్ గా 1.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చని అంచనా వేయగా అందరి అంచనాలను తలకిందలు చేస్తూ నైట్ షోలలో సినిమా సాలిడ్ గ్రోత్ తో ఏకంగా 2.2 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది.

మొత్తం మీద ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 88L
?Ceeded: 28L
?UA: 32L
?East: 17L(5L hires)
?West: 10L
?Guntur: 26L(10L hires)
?Krishna: 15L
?Nellore: 6.3L
AP-TG Total:- 2.22CR(15L hires)??
Ka & ROI: 0.18Cr
OS: 0.32Cr
Total WW: 2.72Cr(5.10Cr Gross)

సినిమాను టోటల్ గా 18.5 కోట్లకు అమ్మగా 19.2 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఫస్ట్ డే సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 16.48 కోట్ల షేర్ ని అందుకుంటే నే బ్రేక్ ఈవెన్ అవుతుంది, సినిమా రెండో రోజు మూడో రోజు భారీగా హోల్డ్ చేస్తేనే ఈ బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.

Leave a Comment