న్యూస్ బాక్స్ ఆఫీస్

జాను 2 డేస్ టోటల్ కలెక్షన్స్…2 వ రోజు కుమ్మింది కానీ!!

శర్వానంద్ మరియు సమంత ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జాను బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి మంచి పాజిటివ్ టాక్ లభించింది, కొంచం స్లో గా ఉందన్న కంప్లైంట్ ఉన్నా కానీ ఆడియన్స్ సినిమా ను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కలెక్షన్స్ పరంగా మరీ అద్బుతాలు సృష్టించడం లేదు కానీ ఉన్నంతలో రెండో రోజు…

రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి హోల్డ్ నే సాధించింది, ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వర్షాలు కొంచం ఎదురుదెబ్బ కొట్టినా కానీ మొత్తం మీద 1.64 కోట్ల షేర్ ని అందుకుని సాలిడ్ గానే హోల్డ్ చేసింది. వరల్డ్ వైడ్ గా 2.08 కోట్ల షేర్ ని అందుకుంది ఈ సినిమా.

రెండు తెలుగు రాష్ట్రాలలో 2 వ రోజు జాను సినిమా కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 73L
?Ceeded: 21L
?UA: 25L
?East: 9L
?West: 8L
?Guntur: 11L
?Krishna: 12.3L
?Nellore: 5L
AP-TG Total:- 1.64CR?
ఇదీ సినిమా రెండో రోజు సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్.

ఇక సినిమా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 1.61Cr
?Ceeded: 49L
?UA: 57L
?East: 26L
?West: 18L
?Guntur: 37L
?Krishna: 27L
?Nellore: 11L
AP-TG Total:- 3.86CR??
Ka & ROI: 0.30Cr
OS: 0.64Cr
Total WW: 4.80CR(8.70Cr Gross)
ఇదీ సినిమా వరల్డ్ వైడ్ గా 2 రోజుల కలెక్షన్స్.

రెండో రోజు కుమ్మినా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 19.2 కోట్లు, రెండు రోజుల తర్వాత సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 14.4 కోట్ల దాకా షేర్ ని అందుకుంటేనే క్లీన్ హిట్ అవుతుంది, అంటే ఆదివారం రెట్టించిన జోరు తో కలెక్షన్స్ ని అందుకుంటేనే వర్కింగ్ డేస్ లో ప్రెజర్ తగ్గుతుంది.

Leave a Comment