న్యూస్ బాక్స్ ఆఫీస్

జార్జ్ రెడ్డి కలెక్షన్స్: టార్గెట్ 3 కోట్లు…6 రోజుల్లో వచ్చింది ఇది!!

యూత్ లో రీసెంట్ టైం లో మంచి బజ్ ని సొంతం చేసుకున్న సినిమా జార్జ్ రెడ్డి…లాస్ట్ వీకెండ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆటకే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో మంచి వసూళ్ళని సాధించిన ఈ సినిమా తర్వాత వర్కింగ్ డేస్ లో కొంచం స్లో అయినా ఉన్నంతలో అన్ సీజన్ ఎఫెక్ట్ ని తట్టుకుని కూడా సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్ళనే సాధిస్తుంది అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజులు పూర్తీ అయ్యే సరికి సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 2.1 కోట్ల షేర్ ని అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 6 రోజులు పూర్తీ అయ్యే సరికి 2.40 కోట్ల షేర్ ని అందుకుంది.

టోటల్ బాక్స్ ఆఫీస్ గ్రాస్ వరల్డ్ వైడ్ గా 4.16 కోట్ల దాకా ఉందని సమాచారం. కాగా సినిమా బడ్జెట్ తక్కువే కాగా సినిమా ను ఓవరాల్ గా 2.5 కోట్ల రేంజ్ లో వరల్డ్ వైడ్ గా అమ్మారు. దాంతో సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే మినిమం 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఏర్పడగా…

సినిమా మొత్తం మీద 6 రోజులు పూర్తీ అయ్యే సరికి సాధించిన 2.4 కోట్ల షేర్ కాకుండా సినిమా మరో 60 లక్షల షేర్ ని అందుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవుతుంది. ఇక సినిమా 7 వ రోజు సాధించే కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ ని క్రాస్ చేయబోతుందని చెప్పొచ్చు.

రెండో వీకెండ్ లో మినిమం హోల్డ్ చేసినా రెండో వారంలో జార్జ్ రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. మరి సినిమా అనుకున్నట్లే బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపి రెండో వారం ముగిసే లోపు బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోగలుగుతుందో లేదో చూడాలి.

Leave a Comment