న్యూస్ రివ్యూ

జై భీమ్ మూవీ రివ్యూ…..ఎక్స్ లెంట్ సినిమా!!

స్టార్ హీరో సూర్య రీసెంట్ టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన హిట్ ని ఇంకా అందుకోవాల్సి ఉండగా లాస్ట్ ఇయర్ సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో రావాల్సింది కానీ డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ అయ్యి డిజిటల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈ ఏడాది సూర్య నటించిన లేటెస్ట్ మూవీ జై భీమ్ కూడా డిజిటల్ లోనే రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో తెలుసు కుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే…గిరిజనులు అయిన రాజన్న మరియు చిన్నతల్లి కూలినాలి చేసుకుంటూ ఉంటారు… ఊరి పెద్ద ఇంట్లో పాము ఉందని తెలిసి పట్టడానికి వెళతాడు రాజన్న… తర్వాత అదే ఇంట్లో దొంగతనం జరుగుతుంది… ఆ దొంగతనం రాజన్న చేయక పోయినా కానీ…

వాళ్ళే చేశారు అనుకుని పోలీసులు రాజన్న కోసం వెతుకూ రాజన్న కుటుంబాన్ని బంధువులను జైలులో హింసిస్తారు… తర్వాత జైలులో నుండి రాజన్న అతనితో తీసుకువచ్చిన 2 తప్పించుకున్నారు అని చెబుతారు. వాళ్ళ ఆచూతి తెలుసుకోవాలని చూసిన చిన్నతల్లి పేదల నుండి రూపాయి కూడా ఫీజు తీసుకోని లాయర్ అయిన చంద్రుని కలుస్తారు…

తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా అసలు సిసలు కథ…. ఒకప్పుడే కాదు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చోటు చేసుకునే రియల్ ఇంసిడెంట్ లను బేస్ చేసుకుని తెరకెక్కించిన సినిమా జై భీమ్. ఈ ఇయర్ తెలుగు లో వచ్చిన నాంది సినిమా లానే ఉండే కథ పాయింట్ ఇక్కడ మరింత రియలిస్టిక్ గా తెరకెక్కించారు… జైలులో వాళ్ళని హింసించిన తీరు చూసి…

కళ్ళలో నీళ్ళు తిరగడం ఖాయం… ఇలా సినిమాలో అనేక సన్నివేశాలు ఆలోచింప జేసేలా ఉంటాయి… సూర్య తన పెర్ఫార్మెన్స్ తో సినిమాను మరో లెవల్ కి తీసుకెళ్ళాడు… తన పెర్ఫార్మెన్స్ ఎంత హైలెట్ అయ్యిందో చిన్నతల్లి రోల్ చేసిన నటి కూడా అంతే బాగా ఆకట్టుకుంది. చిన్న రోల్స్ అయినా ఇంపాక్ట్ ఫుల్ గా ఉన్న ప్రకాష్ రాజ్ మరియు రావ్ రమేష్ లు కూడా మెప్పించారు.

ఓవరాల్ గా లెంత్ కొంచం ఎక్కువ అవ్వడం, మరీ రియలిస్టిక్ గా సీన్స్ ఉండటం లాంటివి కొంచం ఇబ్బంది పెట్టినా కానీ ఈ సిన్సియర్ అటెంప్ట్ ను కచ్చితంగా మెచ్చుకుని తీరాలి… ఇప్పటికీ కొన్ని చోట్ల కులాల పేరిట అంటరానితనం చూపిస్తూ కొందరిపై హింసలు జరుగుతూనే ఉన్నాయి. అవి ఒకప్పుడు ఎలా ఉండేవి అనే పాయింట్ పై డైరెక్టర్…

చాలా బాగా సినిమాను తెరకెక్కించారు, అలాగే ఎలాంటి అడ్రస్ లేని ట్రైబల్స్ ని పోలీసులు పెండింగ్ కేసుల కోసం ఎలా వాడుకుంటారో కూడా చూపెట్టారు. ఓవరాల్ గా కొంచం ఓపికతో సినిమా చూస్తె ఓ మంచి మెసేజ్ ఉన్న సినిమా చూసిన ఫీలింగ్ తప్పకుండా కలుగుతుంది, సూర్య ఆకాశం నీ హద్దురా తర్వాత మరో సారి అదే రేంజ్ లో మెప్పించాడు ఈ సినిమాతో.

Leave a Comment