న్యూస్

టక్ జగదీష్ టీసర్ రివ్యూ….మాస్…సాలిడ్ గా కుమ్మింది!!

నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ టక్ జగదీష్…. శివ్ నిర్వాన డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాలో నాని కి అన్నగా జగపతిబాబు నటిస్తుండగా హీరోయిన్ గా రితు వర్మ నటిస్తుంది.. మరో ముఖ్య రోల్ లో ఐశ్యర్య రాజేష్ నటిస్తుండగా సినిమాను ముందు ఏప్రిల్ 18 న రిలీజ్ అనుకున్నా కానీ ఇప్పుడు రిలీజ్ ను వారం పోస్ట్ పోన్ చేసి ఏప్రిల్ 23 న రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ టీసర్ కట్ లో కన్ఫాం చేశారు.

ఇక టీసర్ ను నాని పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేయగా టీసర్ ఓవరాల్ గా పక్కా కమర్షియల్ హిట్ మూవీ కి ఉండాల్సిన సత్తా ఉన్న మూవీ గా అనిపిస్తుంది, టీసర్ ను డైలాగ్స్ తో కాకుండా థీం సాంగ్ తో రిలీజ్ చేయడం కొత్తగా ఉండగా పాట కొంచం అరవింద సమేత లో… ఊరికి ఉత్తరానా సాంగ్ ని…

అలాగే అల వైకుంఠ పురంలో సిత్తరాల సిరపడు సాంగ్స్ ను గుర్తు చేసింది కానీ తమన్ తన మ్యాజిక్ ని చూపెడుతూ మరోసారి అద్బుతమైన సాంగ్ ని ఈ సినిమా కి అందించాడు, సీమ నేపధ్యంలో ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ ఎలిమెంట్స్ ని కలిపి ఓ పక్కా కమర్షియల్ మూవీ గా..

టక్ జగదీష్ సినిమా రాబోతుంది అన్నట్లు టీసర్ చూస్తె క్లియర్ గా అర్ధం అవుతుంది, డైలాగ్స్ లేకపోవడం ఒక్కటి చిన్న నిరాశని కలిగించే అంశమే అయినా ఓవరాల్ గా టీసర్ కట్ ని చూస్తుంటే నాని కెరీర్ లో బెస్ట్ టీసర్ కట్ అనిపిస్తుంది, అండ్ కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే అవకాశం పుష్కలంగా ఉన్న సినిమాగా అనిపిస్తుంది ఈ సినిమా టీసర్ కట్… హీరోయిజం ఎలివేట్ సీన్స్ ని,

వాటికి ఫ్యామిలీ ఎమోషన్ ని కలిపి టీసర్ ను బాగా కట్ చేశారు… ఇక సినిమా గురించిన మరో న్యూస్ ఇది నాని నేను లోకల్ అండ్ MCA కన్నా కూడా చాలా బాగా కుదిరిన కమర్షియల్ మూవీ అంటున్నారు. ఇది నిజం అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర నాని 50 కోట్లు అవలీలగా అందుకోవచ్చు. ఇక పుట్టిన రోజు ని జరుపుకుంటున్న నాని కి కంగ్రాట్స్ చెబుతున్నాం. ఇక టీసర్ 24 గంటల్లో ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి..

Leave a Comment