గాసిప్స్ న్యూస్

టాప్ స్టార్స్ రేంజ్ లో రెమ్యునరేషన్ అడుగుతున్న బెల్లంకొండ…ఈ రేటు ఏంటి సామి!!

మంచి స్టార్ బ్యాగ్రౌండ్ ఉండటం తో మొదటి సినిమా నుండి హై బడ్జెట్ మూవీస్ తో కెరీర్ ని ప్లాన్ చేసుకుని సినిమా హిట్ కి ఫ్లాఫ్ సంబంధం లేకుండా భారీ సినిమాలను సెట్ చేస్తూ కెరీర్ ని కొనసాగించిన బెల్లంకొండ శ్రీనివాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ మొదలు పెట్టిన 5 ఏళ్ల కి మొదటి క్లీన్ హిట్ ని సొంతం చేసుకున్నాడు… బెల్లంకొండ తో భారీ సినిమాలు తీయడానికి కారణం బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ…

బెల్లంకొండ సినిమాలకు శాటిలైట్ రైట్స్ అలాగే హిందీ డబ్బింగ్ రేటు భారీగా సొంతం అవుతుంది, ఈ అడ్వాంటేజ్ వలనే బెల్లంకొండ తో ఇప్పటికీ భారీ సినిమాలు చేస్తుండగా ఇప్పుడు బాలీవుడ్ లో ఛత్రపతి సినిమా రీమేక్ తో అడుగు పెట్టబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్…

ఆ సినిమా తర్వాత కూడా మరిన్ని సినిమాలను అక్కడ ఒప్పుకోబోతున్నాడు… దాంతో టాలీవుడ్ నుండి తనకి అవకాశం ఇవ్వడానికి వచ్చే డైరెక్టర్స్ అండ్ నిర్మాతలకు ఇప్పుడు భారీ రెమ్యునరేషన్ కావాలంటూ చెబుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇది వరకు ఒక్కో సినిమాకి హిట్ కి ఫ్లాఫ్ కి సంబంధం లేకుండా…

4 కోట్ల నుండి 5 కోట్ల దాకా రెమ్యునరేషన్ ని తీసుకునే బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోలు తీసుకునే రేంజ్ లో ఒక్కో సినిమాకి 15 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అడుగుతున్నట్లు సమాచారం. రీసెంట్ గా తనకి వచ్చిన టాలీవుడ్ ఆఫర్స్ కి ఈ రేంజ్ రెమ్యునరేషన్ అడగడం తో ఏం చేయాలో తెలియక ఆఫర్ ఇచ్చిన వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయారట.

ప్రస్తుతం ఛత్రపతి రీమేక్ అలాగే తెలుగు లో కర్ణన్ రీమేక్ లను ఒప్పుకున్న బెల్లంకొండ తర్వాత బాలీవుడ్ లో సినిమాలను ఒప్పుకోవాలని చూస్తున్నాడట. ఆ సినిమాలను పాన్ ఇండియా లెవల్ లో ఇక్కడ కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ కొత్త ప్లాన్ ఎంతవరకు సక్సెస్ ఫుల్ అవుతుందో అన్నది ఆసక్తి కరం అని చెప్పొచ్చు.

Leave a Comment