న్యూస్

టాలీవుడ్ ఆశలన్నీ ఈ సినిమా మీదే…కారణం ఇదే!!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం భారీ ఎత్తున రావడానికి సిద్ధం అవుతుంది. సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అన్న అనుమానాలు కూడా గట్టిగానే ఉన్నాయి అని చెప్పాలి.

దానికి కారణం రీసెంట్ టైం లో రిలీజ్ అయిన చిన్న సినిమాలు వాటి రేంజ్ లో కలెక్షన్స్ ని బాగానే మ్యానేజ్ చేసి సొంతం చేసుకుంటున్నా కానీ మీడియం రేంజ్ అండ్ హై రేంజ్ మూవీస్ కి ప్రస్తుతం ఉన్న 50% ఆక్యుపెన్సీ అండ్ లో టికెట్ రేట్ల వలన…

కలెక్షన్స్ కి ఇంపాక్ట్ గట్టిగానే ఉంది. ఆ విషయం సీటిమార్ సినిమాతో రుజువు అవ్వగా వాటికి తోడూ నైజాం కలెక్షన్స్ మునుపటిలా జోరు చూపక పోవడం కూడా మరింత ఇబ్బందిని కలగజేస్తూ ఉండటం తో జనాలలో సీటిమార్ లాంటి మాస్ మూవీ కాదు లవ్ స్టొరీ లాంటి మంచి క్రేజ్ ఉన్న మూవీ అవసరం ఎంతైనా ఉంది..

ఈ సినిమా పై సాలిడ్ అంచనాలు ఉండగా సినిమా కనుక ఓపెనింగ్స్ 6-8 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుని వీకెండ్ వరకు సాలిడ్ ట్రెండ్ ని కనుక కొనసాగించినట్లు అయితే కచ్చితంగా పెద్ద సినిమాలు అన్నీ కూడా ఊపిరి పీల్చుకుని రిలీజ్ డేట్ లను అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది… కానీ 6-8 కోట్లు ప్రస్తుతం ఉన్న లో టికెట్ రేట్లతో సాధించడం అంటే…

సినిమా ఊహకందని ట్రెండ్ ని కొనసాగిస్తేనే సాధ్యం అవుతుంది… దాంతో ఇప్పుడు టాలీవుడ్ మొత్తం లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ ను భారీగా షేక్ చేసి పరిస్థితులను నార్మల్ అయ్యేలా చేయాలనీ కోరుకుంటున్నారు. మరి లవ్ స్టొరీ సినిమా ఈ అంచనాలను ఎంతవరకు బాక్స్ ఆఫీస్ దగ్గర నిజం అయ్యేలా చేసి ఇండస్ట్రీకి ఊపిరి పోస్తుందో చూడాలి ఇక..

Leave a Comment