న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

టాలీవుడ్ చరిత్రలో సంక్రాంతి సీజన్స్ ఆల్ టైం టాప్ 15 షేర్ మూవీస్!!

టాలీవుడ్ అతిపెద్ద సినిమా సీజన్ సంక్రాంతి పండగ, టాలీవుడ్ లో ఉన్న ప్రతీ హీరో ఒక్కసారైనా ఈ సీజన్ లో తమ సినిమా విడుదల అయ్యి రికార్డుల దుమ్ము దులపాలని ఆశిస్తూ ఉంటారు, కానీ కొందరు మాత్రమే ఈ రికార్డులను క్రియేట్ చేయడంలో సఫలం అవుతూ వస్తున్నారు. ఇప్పుడు 2020 లో మరిన్ని సినిమాలు ఈ రేసులో నిలుస్తున్నాయి. ఇలాంటి టైం లో సంక్రాంతి సీజన్స్ లో విడుదల అయ్యి టాప్ గ్రాసర్స్ గా నిలిచిన సినిమాలో ఏవో తెలుసుకుందాం పదండి.

సినిమా పేరు టోటల్ కలెక్షన్స్
చిరంజీవి “ఖైదీనంబర్ 150″(2017)——104 కోట్లు
వెంకటేష్- వరుణ్ తేజ్ “ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్”(2019)—–84.51 కోట్లు
రామ్ చరణ్ “వినయ విధేయ రామ”(2019)—63.4 కోట్లు
బాలకృష్ణ “గౌతమిపుత్ర శాతకర్ణి”(2017)—-60 కోట్లు(నిర్మాతల లెక్క)
పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి(2018)—57.5 కోట్లు
ఎన్టీఆర్ “నాన్నకుప్రేమతో”(2016)———55.6 కోట్లు
మహేష్ బాబు-వెంకటేష్ “సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు”(2013)———51.60 కోట్లు
నాగార్జున “సోగ్గాడే చిన్నినాయనా”(2016)—-49.5 కోట్లు

రామ్ చరణ్ “ఎవడు”(2014)———–48 కోట్లు
రామ్ చరణ్ “నాయక్”(2013)———-47.50 కోట్లు
అనుష్క “అరుంధతి”(2009)———-43.10 కోట్లు ( టోటల్ వరల్డ్ వైడ్ అన్ని భాషల కలెక్షన్స్)
పవన్ కళ్యాణ్-వెంకటేష్ “గోపాలగోపాల”(2015)—-42.10 కోట్లు
మహేష్ బాబు “బిజినెస్ మాన్”(2012)———-40.30 కోట్లు ( టోటల్ వరల్డ్ వైడ్ అన్ని భాషల కలెక్షన్స్)
శర్వానంద్ “శతమానం భవతి”(2017)—–32.5 కోట్లు
మహేష్ బాబు “1 నేనొక్కడినే”(2014)———-29.30 కోట్లు
శంకర్-విక్రం “ఐ మనోహరుడు”(2015)——-28.73 కోట్లు

ఇందులో అరుంధతి-బిజినెస్ మాన్ సినిమాలు మొదట్లో తక్కువగానే కలెక్ట్ చేసినా తరువాత మిగిలిన భాషల్లో డబ్ చెయ్యడంతో కలెక్షన్స్ పెరిగాయి. 2017 ఇయర్ అన్ డౌటెడ్ గా అన్ని సంక్రాంతి సీజన్స్ లోకి ది బెస్ట్ సీజన్ గా చెప్పుకోవాలి. ఆ సీజన్ లో రిలీజ్ అయిన అందరు హీరోల మూవీస్ వారి కెరీర్ బెస్ట్ రికార్డులను అందుకున్నాయి.

ఇక 2019 ఇయర్ అనుకున్న ఫలితాలు రాకున్నా ఎఫ్ 2 సినిమా ఊహకందని విజయం తో కొంచం బెటర్ గా ముగించేలా చేసింది. ఇక 2020 ఇయర్ లో దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠ పురంలో మరియు ఎంత మంచి వాడవురా సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇవన్నీ సూపర్ సక్సెస్ అయ్యి పైన లిస్టులో చోటు దక్కించుకోవాలని కోరుకుందాం…

Leave a Comment