న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

టాలీవుడ్ లో అత్యధిక 75 కోట్ల షేర్ హీరోలు వీరే!!

ఒకప్పుడు టాలీవుడ్ లో 70 కోట్లు అందుకోవడం అంటే లాంగ్ రన్ లో ఓ రేంజ్ లో హోల్డ్ చేస్తే కానీ సాధ్యం అయ్యేది కాదు, కానీ ఇప్పుడు మార్కెట్ ఎక్స్ పాన్షన్ ఓ రేంజ్ లో జరగడం తో పెద్ద సినిమాలు కేవలం మొదటి వారం పది రోజుల లోపే ఈ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టిస్తూ దూసుకు పోతున్నాయి. ఇక రీసెంట్ టైం లో టాలీవుడ్ లో హైయెస్ట్…

75 కోట్ల షేర్ ఉన్న హీరోలను గమనిస్తే… టాప్ ప్లేస్ లో ఎన్టీఆర్ మూడు సినిమాలతో టాప్ లో ఉన్నాడు. జనతా గ్యారేజ్, జైలవకుశ మరియు అరవింద సమేత లు 75 కోట్ల మార్క్ ని అందుకోవడమే కాదు వరుసగా అందుకుని టాప్ లో ఉండేలా చేశాయి.

ఇక రెండో ప్లేస్ లో మహేష్ బాబు శ్రీమంతుడు, భరత్ అనే నేను మరియు మహర్షి తో మూడు సినిమాలను అందుకున్నాడు. రెండు వరుస 75 కోట్లు కొట్టిన మహేష్ అనిల్ రావిపూడి సినిమా తో మరో 75 కోట్ల సినిమా కొడితే ఎన్టీఆర్ ల హాట్రిక్ పూర్తీ అవుతుంది.

ఇక తర్వాత ప్లేసులో ప్రభాస్ బాహుబలి సిరీస్ తో రెండు సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక త్వరలో వస్తున్న సాహో తో హాట్రిక్ 75 కోట్ల షేర్ మార్క్ ని ఎన్టీఆర్ తర్వాత అందుకునే అవకాశం ప్రభాస్ కి ఎక్కువగా ఉంది. ఇక రామ్ చరణ్ మగధీర మరియు…

రంగస్థలం సినిమాలతో 2 సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. మగధీర తెలుగు వర్షన్ 73.88 కోట్లే చేసినా అన్ని వర్షన్స్ తో కలిపి ఈ మార్క్ ని దాటేసింది. ఓవరాల్ గా ఈ హీరోలు ఎక్కువ సార్లు 75 కోట్ల షేర్ ని అందుకుని ముందు నిలిచారు. మరింతమంది హీరోలు ఈ లిస్టులో చోటు దక్కించుకోవాలని కోరుకుందాం… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!