న్యూస్ స్పెషల్

టాలీవుడ్ లో 24 గంటలలో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టాప్ 5 టీసర్లు!

రీసెంట్ గా రిలీజ్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట టీసర్ టాలీవుడ్ తరుపున వ్యూస్ పరంగా మొదటి 24 గంటల్లో సంచలన రికార్డులను నమోదు చేసి దుమ్ము దుమారం చేసింది. మిడ్ నైట్ లో సడెన్ రిలీజ్ చేసినప్పటికీ కూడా యూట్యూబ్ లో మొత్తం మీద 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి సాలిడ్ రికార్డులతో దుమ్ము దుమారం చేయడం విశేషం అని చెప్పొచ్చు.

మొత్తం మీద టాలీవుడ్ టీసర్ ల పరంగా మొదటి 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకున్న టాప్ 5 టీసర్ లను గమనిస్తే… టాప్ 5 ప్లేస్ లో 2019 లో వచ్చిన ప్రభాస్ సాహో టీసర్ 24 గంటల్లో 12.94 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుని టాప్ 5 లో నిలిచింది…

ఇక టాప్ 4 ప్లేస్ కి వస్తే ఆర్ ఆర్ ఆర్ సినిమా లోని ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ మొదటి 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి 14.14 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుని టాప్ 4 లో ఉండగా టాప్ 3 ప్లేస్ లో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా మొదటి 24 గంటల్లో…

మొత్తం మీద 14.64 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుని టాప్ 3 లో ఉండగా టాప్ 2 ప్లేస్ లో అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప సినిమా లో ఇంట్రో టీసర్ మొదటి 24 గంటల్లో ఏకంగా 22.54 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుని టాలీవుడ్ లో ఫస్ట్ 20 మిలియన్ వ్యూస్ ని 24 గంటలలో అందుకున్న టీసర్ గా బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఇప్పుడు మహేష్ బాబు…

లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట టీసర్ మొదటి 24 గంటల్లో ఏకంగా 23.06 మిలియన్ మార్క్ ని అందుకుని బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ ని అప్ కమింగ్ టీసర్ లకు సెట్ చేసింది. మరి ఫ్యూచర్ లో ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే ఛాన్స్ ఉన్న సినిమా గా ఏ సినిమా నిలుస్తుందో చూడాలి. పాన్ ఇండియా మూవీస్ నాన్ పాన్ ఇండియా మూవీస్ చాలానే ఉన్నాయి రేసులో..

Leave a Comment