న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

టాలీవుడ్ స్టార్ హీరోలలో [2010-2020] ఎక్కువ హిట్స్ ఎవరివో తెలుసా?

టాలీవుడ్ లో స్టార్ హీరోల విషయం లో 2010 నుండి 2020 ఏళ్లలో పెద్దగా మార్పులు లేవు. ఉన్నంతలో టైం మారుతూ ఒక్కో సమయం లో ఒక్కో హీరో డామినేట్ చేస్తూ వచ్చారు అని చెప్పాలి… హిట్స్ పడినప్పుడు ఆటోమాటిక్ గా టాప్ కి వెళ్ళడం, ఫ్లాఫ్స్ పడినప్పుడు డౌన్ అవ్వడం జరిగినా దాదాపు అందరు స్టార్ హీరోలు ఎక్కువ సినిమాలతోనే అలరించారు… వారిలో కొందరు ఎక్కువ సార్లు విజయాలను నమోదు చేయగలిగారు… ఒకసారి లాస్ట్ 2010 నుండి 2020 ఏళ్లలో మన హీరోల హిట్స్ ఫ్లాఫ్స్ ని గమనిస్తే…

పవన్ కళ్యాణ్:
గత 11 ఇయర్స్ లో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు 10 అందులో హిట్ అయిన సినిమాలు మాత్రం 2… ఒకటి గబ్బర్ సింగ్ మరోటి అత్తారింటికి దారేది… కెమరామెన్ గంగతో రాంబాబు, గోపాల గోపాల సినిమాలు యావరేజ్ గా నిలవగా మిగిలిన సినిమాలు ఫ్లాఫ్స్ గా నిలిచాయి.

అల్లుఅర్జున్:
అల్లుఅర్జున్ 11 ఇయర్స్ లో 12 సినిమాల్లో నటించగా 5 హిట్స్ వచ్చాయి… వాటిలో జులాయి, రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు మరియు అల వైకుంఠ పురం లో సినిమాలు హిట్స్ గా నిలిచాయి. సన్ ఆఫ్ సత్యమూర్తి జస్ట్ బ్రేక్ ఈవెన్ అయింది. మిగిలిన సినిమాల్లో బద్రీనాథ్, రుద్రమదేవి DJ సినిమాలు యావరేజ్ గా నిలిచాయి.. మిగిలిన సినిమాలు ఫ్లాఫ్ అయ్యాయి.

రామ్ చరణ్:
రామ్ చరణ్ 11 ఏళ్లలో 10 సినిమాలు చేయగా అందులో 5 హిట్స్ దక్కాయి…. రచ్చ, నాయక్, ఎవడు, ధృవ మరియు రంగస్థలం సినిమాలు హిట్స్ అవ్వగా…గోవిందుడు అందరివాడేలే ఎబో యావరేజ్ అయింది. మిగిలిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ గా నిలిచాయి. 2000 దశకం ఎండింగ్ లో మగధీరతో ఇండస్ట్రీ హిట్ కొట్టగా 2018 రంగస్థలంతో మరో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు రామ్ చరణ్.

ప్రభాస్:
రెబల్ స్టార్ ప్రభాస్ 11 ఏళ్లలో చేసిన సినిమాలు 7 కాగా అందులో 5 హిట్స్ ఉన్నాయి… డార్లింగ్, మిస్టర్ పెర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి 1 మరియు బాహుబలి 2 లు హిట్స్ అవ్వగా సాహో యావరేజ్ గా నిలవగా రెబల్ ఒక్కటే ఫ్లాఫ్ అయింది. ఈ 11 ఇయర్స్ లో ఎవ్వరి ఊహకలకు అందని రికార్డుల రారాజు పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి.

ఎన్టీఆర్:
ఈ 11 ఇయర్స్ లో ఎన్టీఆర్ ఏకంగా 13 సినిమాలు చేయగా అందులో 7 క్లీన్ హిట్స్ ఉన్నాయి… అదుర్స్, బృందావనం, బాద్ షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ మరియు అరవింద సమేతలు క్లీన్ హిట్ అవ్వగా.. దమ్ము సినిమా సెమీ హిట్ గా, జై లవ కుశ ఎబో యావరేజ్ గా నిలిచాయి. మిగిలిన సినిమాలు ఫ్లాఫ్స్ గా నిలిచాయి.

మహేష్ బాబు:
ఈ 11 ఇయర్స్ లో మహేష్ బాబు మొత్తం మీద 12 సినిమాలు చేయగా అందులో 7 హిట్స్ గా నిలిచాయి..దూకుడు, బిజినెస్ మాన్, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి మరియు సరిలేరు నీకెవ్వరు సినిమాలు హిట్స్ అవ్వగా మిగిలిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాఫ్స్ అయ్యాయి..

West All Time Top 10 Share Movies

ఇవీ మొత్తం మీద ఈ దశాబ్దంలో మన స్టార్ హీరోల పెర్ఫార్మెన్స్…అందరు టాప్ హీరోల లో పవన్ కళ్యాణ్ మాత్రమే హిట్స్ పరంగా కొద్దిగా వెనకబడి ఉన్నా 2021 లో వకీల్ సాబ్ తో దుమ్ము లేపాడు, ఇక వచ్చే ఒకటి రెండు ఇయర్స్ లో మన హీరోల రేంజ్ మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

Vizag/Uttarandhra All Time Top 10 Share Movies

ఇప్పుడు కరోనా వల్ల 2020 ఇయర్ లెక్కలోకి వచ్చేలా లేదు… ఇక 2021 నుండి ఎక్కువ సినిమాలతో అందరూ దుమ్ము లేపాలని కోరుకుందాం…

Leave a Comment