న్యూస్ స్పెషల్

టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో టెలివిజన్ లో లోవేస్ట్ TRP సాధించిన సినిమాలు ఇవే!!

టెలివిజన్ లో ప్రతీ వారం అనేక సినిమాలు టెలికాస్ట్ అవుతూ ఉంటాయి, కొన్ని సినిమాలకు వాటిలో మంచి రేటింగ్స్ దక్కుతూ ఉంటాయి, కొన్ని సినిమాలకు మాత్రం రేటింగ్స్ మరీ అనుకున్న రేంజ్ లో దక్కవు, కానీ కొన్ని స్టార్ హీరోల సినిమాలకు కూడా అప్పుడప్పుడు టెలివిజన్ లో అతి తక్కువ TRP రేటింగ్ లు దక్కి అందరికీ షాక్ ఇచ్చినవి ఉన్నాయి… ఒకసారి ఆ సినిమాలు ఏంటో ఒక లుక్ వేద్దాం పదండీ…

ముందుగా స్టార్ హీరోల సినిమాలలో లోవేస్ట్ లో హైయెస్ట్ రేటింగ్ ని సొంతం చేసుకున్న సినిమా గా రామ్ చరణ్ వినయ విదేయ రామ సినిమా 8.1 రేటింగ్ ని మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది, కానీ తర్వాత టెలివిజన్ బ్లాక్ బస్టర్ అయింది.

ఇక మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ తో పాటు టెలివిజన్ లో కూడా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు కేవలం 7.52 రేటింగ్ ని సొంతం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ఇక మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 మూవీ….

బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ అయినా కానీ టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు మొదటి సారి 6.93 రేటింగ్ ని మాత్రమె సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది. ఇక తర్వాత మహేష్ స్పైడర్ సినిమా అటు బాక్స్ ఆఫీస్ డిసాస్టర్ అవ్వగా ఇటు టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ అయినప్పుడు 6.7 రేటింగ్ ని అందుకుని భారీ షాక్ ఇచ్చి డిసాస్టర్ అయ్యింది.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ సరైనోడు సినిమా టెలివిజన్ లో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 6.2 రేటింగ్ ని మాత్రమె సొంతం చేసుకుని ఫస్ట్ అటెంప్ట్ లో ఊహకందని షాక్ ఇచ్చింది, కానీ తర్వాత లాంగ్ రన్ లో ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇక రెండేళ్ళ క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ డిసాస్టర్ మూవీ గా నిలిచిన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు సరైనోడు సినిమా రికార్డ్ ను బ్రేక్ చేసి 6.1 రేటింగ్ ని సొంతం చేసుకుని లోవెస్ట్ TRP రేటింగ్ మూవీ గా చరిత్ర సృష్టించగా… ఇప్పుడు ఆ రికార్డ్ ను…

ప్రభాస్ నటించిన లాస్ట్ ఇయర్ మూవీ సాహో బ్రేక్ చేసింది. ఈ సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేసి స్టార్ హీరోల సినిమాలలో లోవేస్ట్ TRP రేటింగ్ ని సొంతం చేసుకుని ఎపిక్ డిసాస్టర్ గా టెలివిజన్ లో నిలిచింది. కేవలం 5.81 రేటింగ్ ని మాత్రమె సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది ఈ సినిమా…

ఇవి మొత్తం మీద టాలీవుడ్ టెలివిజన్ లో స్టార్ హీరోల సినిమాల పరంగా అతి తక్కువ రేటింగ్ లను సొంతం చేసుకున్న కొన్ని సినిమాలు, అన్నీ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర టెలివిజన్ లో హిట్ అవ్వాలని రూల్ లేదు కానీ హిట్ అయిన సినిమాలు ఇక్కడ షాకింగ్ లో రేటింగ్స్ ని అందుకోవడం విచారకరం అనే చెప్పాలి.

Leave a Comment