టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

టెంపర్ రీమేక్…అయోగ్య టోటల్ కలెక్షన్స్…దిమ్మతిరిగే షాక్ ఇది!!

ఒకటి తర్వాత ఒకటి వరుస ఫ్లాపుల్లో ఉన్న సమయంలో టెంపర్ తో అల్టిమేట్ కంబ్యాక్ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సినిమా లో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కి ఓ రేంజ్ లో అప్లాజ్ కూడా వచ్చింది. ఆ తర్వాత కెరీర్ లో ఇప్పటి వరకు ఫ్లాఫ్ అంటే తెలియకుండా కెరీర్ ని కొనసాగిస్తున్నాడు ఎన్టీఆర్. అలాంటి టెంపర్ మూవీ రెండు చోట్ల రీమేక్ అయ్యింది. ఒకటి హిందీ లో మరోటి తమిళ్ లో…

హిందీ లో రణవీర్ సింగ్ సింబా పేరు తో రీమేక్ చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ను తమిళ్ లో టాలెంటెడ్ హీరో విశాల్ అయోగ్య పేరు తో రీమేక్ చేశాడు.

విశాల్ మంచి పెర్ఫార్మెన్స్ నే ఇచ్చినా ఎందుకనో అక్కడ ఆడియన్స్ సినిమా ను హిట్ చేయలేదు. సినిమా మొత్తం మీద అక్కడ 10.55  గ్రాస్ ని మాత్రమె కలెక్ట్ చేసింది. కేరళ, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి మరో 1.5 కోట్ల గ్రాస్ రాగా… మొత్తం మీద తమిళ్ వర్షన్ షేర్….

5.5 కోట్ల రేంజ్ లో వచ్చింది, సినిమా కి అక్కడ 25 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరగగా భారీ డిసాస్టర్ గా నిలిచింది. ఇక సినిమా ఇదే పేరు తో తెలుగు లో డబ్ అయ్యి చాలా సైలెంట్ గా రిలీజ్ అయినా కానీ జనాలు తెలుగు లో సినిమా ను బాగానే ఆదరించారు అని చెప్పాలి. తెలుగు లో సినిమాను… 2.2 కోట్లకు అమ్మగా…

2.8 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో తెలుగు లో 1.86 కోట్ల రేంజ్ షేర్ ని వసూల్ చేసింది. తమిళ్ తో పోల్చుకుంటే తెలుగు లో సినిమా కి కేవలం బిజినెస్ నుండి 34 లక్షల లాస్ మాత్రమే రావడం విశేషం అనే చెప్పాలి. అది కూడా ఎలాంటి ప్రమోషన్ లేకుండా సాధించడం షాకింగ్ అనే చెప్పాలి.

Leave a Comment