గాసిప్స్ న్యూస్

టైటిల్ తోనే హైప్ పెంచిన సూర్య “వాడి వాసల్”….సినిమా స్టొరీ పాయింట్ ఇదే!

కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న స్టార్స్ లో సూర్య ముందు నిలిచే నటుడు, గజినీ తోనే తెలుగు లో మంచి క్రేజ్ ని ఎప్పుడో సొంతం చేసుకుని తర్వాత ఒకటి తర్వాత ఒకటి క్రేజీ మూవీస్ తో తెలుగు లో మీడియం రేంజ్ హీరోలకి సమానంగా మార్కెట్ ని సొంతం చేసుకున్నా కానీ తర్వాత సరైన సినిమాలు పడక పోవడం తో మార్కెట్ ని కోల్పోతూ వచ్చిన సూర్య…

ఇప్పుడు ఎలాగైనా ఓ భారీ సక్సెస్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఎండ్ లో వచ్చిన ఆకాశం నీ హద్దు రా థియేటర్స్ లో రిలీజ్ అయి ఉంటే రచ్చ వేరుగా ఉండేది కానీ అలా జరగలేదు. ఇక ఆ సినిమా తర్వాత సూర్య…

చేస్తున్న కొత్త సినిమా వెట్రి మారన్ డైరెక్షన్ లో “వాడి వాసల్” పేరుతో తెరకెక్క బోతుండగా ఈ సినిమా టైటిల్ లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. టైటిల్ లుక్ తోనే అదుర్స్ అనిపించిన ఈ సినిమా స్టొరీ పాయింట్ ఏంటి అనేది కూడా ఆల్ మోస్ట్ రివీల్ చేయగా…

సినిమా కథ మొత్తం కూడా తమిళనాడులో ఫేమస్ అయిన జల్లి కట్టు ఉత్సవాల నేపథ్యంలో ఉంటుందని చెబుతున్నారు. ఇది వరకు కూడా జల్లికట్టు నేపధ్యంలో సినిమాలు వచ్చాయి కానీ ఈ సినిమా కాన్సెప్ట్ మరింత డిఫెరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు.. సూర్య జల్లికట్టు దృశ్యాలలో ఎక్కువగా కనిపిస్తారని, అందుకోసం స్పెషల్ ట్రైనింగ్ ను తీసుకుని సినిమా కోసం ఎదురు చూస్తున్నారని…

త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుంటుందని అంటున్నారు. మాస్ ఎలిమెంట్స్, ఎలేవేషణ్ సీన్స్ వెట్రి మారన్ సినిమాల్లో కామన్, ఇక ఈ సినిమా లో ఆ డోస్ మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇది కనుక నిజం అయితే సినిమా కి తెలుగు లో కూడా సాలిడ్ క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది. మరి ఈ సినిమాతో సూర్య తెలుగు లో కూడా ఓ భారీ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం…

Leave a Comment