న్యూస్

టైటిల్ రికార్డులు…ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకి రికార్డులు బద్దలు!!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో చాలా రోజులకు ప్రభాస్ కొత్త సినిమా అప్ డేట్ రావడంతో ఓ రేంజ్ లో రెచ్చి పోతూ దూసుకు పోతున్నారు. సాహో వచ్చిన 10 నెలల తర్వాత ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న 20 వ సినిమా అఫీషియల్ అప్ డేట్ వచ్చేసింది. సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేయగా రెస్పాన్స్ ఫుల్ పాజిటివ్ గా ఉందని చెప్పాలి.

ఇక సినిమా ఫస్ట్ లుక్ పై రికార్డ్ లెవల్ ట్రెండ్ తో దుమ్ము లేపుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. టాలీవుడ్ లో టైటిల్ అనౌన్స్ మెంట్ ట్రెండ్స్ అండ్ ఫస్ట్ లుక్ ట్రెండ్స్ విషయం లో రీసెంట్ టైం లో టాప్ ప్లేస్ లో దూసుకు పోతున్న మహేష్ బాబు అప్ కమింగ్ మూవీ…

అయిన సర్కారు వారి పాట ట్రెండ్ ని బ్రేక్ చేయడమే ధ్యేయంగా దూసుకు పోతున్న ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పటికే సాలిడ్ జోరు తో దూసుకు పోతూ 3 మిలియన్ మార్క్ ని దాటేసి ఆల్ మోస్ట్ 3.5 మిలియన్ మార్క్ ని కూడా అందుకుంటూ దుమ్ము దుమారం చేస్తున్నారు.

కాగా సర్కారు వారి పాట టైటిల్ అనౌన్స్ మెంట్ ట్రెండ్ లో 4.4 మిలియన్ వ్యూస్ పోల్ అవ్వగా ఈ రోజు పూర్తీ అయ్యే టైం కి ఆ రికార్డ్ బ్రేక్ అయ్యేలా కనిపిస్తుంది. ఇక 24 గంటలు పూర్తీ అయ్యే సమయానికి టాలీవుడ్ లో ఇప్పుడు టైటిల్ అనౌన్స్ మెంట్ కం ఫస్ట్ లుక్ ట్రెండ్స్ రెండూ కలిపి బిగ్గెస్ట్ ట్రెండ్ రికార్డ్ ను…

ప్రభాస్ 20 వ సినిమా రాధే శ్యామ్ సొంతం చేసుకోబోతుందని చెప్పాలి. ఇక మొత్తం మీద 24 గంటల్లో ఓవరాల్ గా ఎంత లీడ్ తో కొత్త బెంచ్ మార్క్ ని అప్ కమింగ్ ట్రెండ్స్ కి ప్రభాస్ ఫ్యాన్స్ సెట్ చేస్తారో చూడాలి. ఫైనల్ కౌంట్ 24 గంటల తర్వాత ఎంత అయ్యిందో కొన్ని గంటల్లో అప్ డేట్ చేస్తాం….

Leave a Comment