టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

డిజిటల్ హిట్…సాంగ్స్ బ్లాక్ బస్టర్…బాక్స్ ఆఫీస్ రిజల్ట్ మాత్రం దెబ్బ కొట్టిందిగా…!!

రిలీజ్ అయినప్పుడు కన్నా తర్వాత సాంగ్స్ హిట్ అండ్ డిజిటల్ లో చూసిన వాళ్ళు బాగుంది అని చెప్పడం తో హిట్ అయిన సినిమాల్లో లాస్ట్ ఇయర్ వచ్చిన పలాసా 1978 సినిమా కూడా ఒకటి అని చెప్పొచ్చు…. ఫస్ట్ వేవ్ కన్నా ముందు ఆడియన్స్ ముందుకు మినిమమ్ హైప్ తో వచ్చి ఎఫెక్ట్ అయిన సినిమా పలాస. రా రస్టిక్ కథాంశం తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో కి పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా అన్ సీజన్ అవ్వడం తో అనుకున్న రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర పెర్ఫార్మ్ చేయలేక పోయింది. కంటెంట్ బాగానే ఉన్నా కానీ…

సీజన్ ఎఫెక్ట్, దానికి తోడూ కరోనా కూడా ఎఫెక్ట్ చూపడం మొదలు పెట్టగా ఇక అర్ధాంతరంగా పరుగును ఆపేసిన సినిమాల్లో పలాస 1978 సినిమా కూడా ఒకటి, తర్వాత టిక్ టాక్ పుణ్యామా అని సినిమా పాటలు బాగా ఫేమస్ అవ్వగా అమెజాన్ ప్రైమ్ లో సినిమాను విరగబడి చూశారు చాలామంది…

1.2 కోట్ల రేంజ్ బిజినెస్ ని సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాల్లో చెప్పుకున్నారు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 1.5 కోట్లకు అటూ ఇటూ గా టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి వారం లో మొత్తం మీద 68 లక్షల దాకా షేర్ ని వసూల్ చేసిన ఈ సినిమా…..

లాక్ డౌన్ వరకు మిగిలిన రన్ లో మొత్తం మీద మరో 6 లక్షల దాకా షేర్ ని అందుకుందట. దాంతో టోటల్ షేర్ 74 లక్షల రేంజ్ లో ఉందని సమాచారం.. కరోనా ఎఫెక్ట్ లేకుండా ఉండి సినిమా కి మరింతగా పబ్లిసిటీ లాంటివి చేసి ఉంటె కచ్చితంగా లాంగ్ రన్ లో సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకున్నా అందుకొక పోయినా బిజినెస్ కి క్లోజ్ గా అయినా వెళ్లి ఉండేది అని చెప్పాలి.

ఓవరాల్ గా సినిమా బిజినెస్ నుండి 46 లక్షల మేర నష్టపోయి పరుగును ఫ్లాఫ్ గా మధ్యలోనే ముగించాల్సి వచ్చింది, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకొక పోయినా కానీ తర్వాత డిజిటల్ లో సూపర్ హిట్ గా నిలవడం సాంగ్స్ తర్వాత అద్బుతమైన రీజ్ ని సొంతం చేసుకోవడం తో డిజిటల్ లో బాగా చూశారు ఈ సినిమా ని….

Leave a Comment