టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

డియర్ మేఘ టోటల్ కలెక్షన్స్…ఈ సినిమాకి అన్యాయం జరిగింది!

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫీల్ గుడ్ మూవీలా రిలీజ్ అయిన డియర్ మేఘ సినిమా డీసెంట్ టాక్ ని సొంతం చేసుకుంది, కన్నడలో మంచి విజయాన్ని నమోదు చేసిన దియా సినిమా రీమేక్ గా వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 130 థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా మంచి టాక్ ని సొంతం చేసుకున్న మొదటి వీకెండ్ లో మొత్తం మీద 14 లక్షల షేర్ ని 25 లక్షల గ్రాస్ ని అందుకుంది.

ఇక టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి 21 లక్షల రేంజ్ షేర్ ని 40 లక్షల లోపు గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుని పరుగును ముగించింది, సినిమాకి బిజినెస్ ఏమి జరగలేదు, ఓన్ గా రిలీజ్ చేశారు… కానీ సినిమా కి భారీ అన్యాయం జరిగింది…

ఈ సినిమా రిలీజ్ టైం కి కన్నడ దియా సినిమాను తెలుగు లో డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమాను అస్సలు జనాలు థియేటర్ కి వెళ్లి చూడాలని కూడా అనుకోలేదు, ఒరిజినల్ తెలుగు డబ్ నే చూడటం తో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రిజల్ట్ తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి.

Leave a Comment