న్యూస్ బాక్స్ ఆఫీస్

డిసాస్టర్ టాక్ తో 50 ఔట్….ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్!!

కోలివుడ్ సూపర్ స్టార్ రజినీ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ అన్నాట్టే తెలుగు లో భారీ రిలీజ్ ను సొంతం చేసుకుని డిసాస్టర్ ఓపెనింగ్స్ ను సాధించింది, తెలుగు లో పోటి ఉన్నా దీపావళి హాలిడే రోజున అన్ని సినిమాలకు ఆ ఎఫెక్ట్ ఉండగా ఒక్క ఎనిమీ మాత్రం కొంచం బెటర్ గా పెర్ఫార్మ్ చేసింది. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు అల్టిమేట్ కలెక్షన్స్ ని డిసాస్టర్ టాక్ తో…

సొంతం చేసుకుని సెకెండ్ వేవ్ తర్వాత ఇండియాలోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది. సినిమా తమిళనాడులో మొదటి రోజు 24.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. సినిమా 18 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకున్నా…

టాక్ ఎఫెక్ట్ అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపి 13.65 కోట్ల షేర్ ని 24.75 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఇక సినిమా తెలుగు లో 2.45 కోట్ల గ్రాస్ ను 1.6 కోట్ల షేర్ ని అందుకోగా కర్ణాటకలో 4.1 కోట్ల గ్రాస్ ను 2.1 కోట్ల షేర్ ని సాధించింది. ఇక కేరళలో సినిమా మొదటి రోజు…

1.1 కోట్ల గ్రాస్ ను 45 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఆల్ మోస్ట్ 1 కోటి గ్రాస్ ను 45 లక్షల షేర్ ని సాధించింది. సినిమా టోటల్ ఇండియాలో 33.4 కోట్ల గ్రాస్ ను 18.25 కోట్ల షేర్ ని అందుకుంది. ఇక ఓవర్సీస్ లో ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ ఇంకా మొత్తం రిపోర్ట్ అందాల్సి ఉండగా ఇప్పటి వరకు అందిన రిపోర్ట్స్ తో….

16 కోట్ల గ్రాస్ ను 7.65 కోట్ల షేర్ ని అందుకుంది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా 49.4 కోట్ల గ్రాస్ ను 25.9 కోట్ల షేర్ ని అందుకుంది, కంప్లీట్ ఓవర్సీస్ రిపోర్ట్ ఇంకా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉన్న నేపధ్యంలో 50 కోట్ల మార్క్ ని అందుకుని ఇంకా ముందుకు వెళ్ళే ఛాన్స్ ఎంతైనా ఉంది. డిసాస్టర్ టాక్ తో ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ భీభత్సం సృష్టించడం రజినీకే చెల్లింది అని చెప్పాలి

Leave a Comment