గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

డిసాస్టర్ మూవీ…నిర్మాతకి టోటల్ ప్రాఫిట్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్!!

అనిల్ రావిపూడి సమర్పకుడిగా నిర్మించిన లేటెస్ట్ మూవీ గాలి సంపత్… లేటెస్ట్ గా భారీ పోటి లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా కంప్లీట్ అండర్ పెర్ఫార్మ్ చేసిన సినిమా వీకెండ్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా హోల్డ్ చేయలేక పోయిన ఈ సినిమా భారీ నష్టాలను సొంతం చేసుకుని ఇప్పుడు డిసాస్టర్ గా నిలిచింది.

దాంతో సినిమాను కొన్న బయ్యర్లు అందరూ కూడా ఇప్పుడు భారీ లాస్ లను సొంతం చేసుకుని లభో దిబో అంటున్నారు. కానీ నిర్మాతలు మాత్రం సినిమా బిజినెస్ టైం లో నాన్ రిఫండబుల్ అగ్రిమెంట్ కింద చాలా ఏరియాల బిజినెస్ చేయడం తో ఇప్పుడు సినిమా నష్టాలు సొంతం చేసుకున్న నిర్మాతలకు పోయేది ఏమి లేదు…

పైపెచ్చు ఈ సినిమా తో నిర్మాతలకు అల్టిమేట్ ప్రాఫిట్స్ కూడా దక్కాయి అని చెప్పాలి. సినిమాను టోటల్ గా 5 కోట్ల రేంజ్ లోపు బడ్జెట్ లో రూపొందించారు… సినిమాను థియేట్రికల్ బిజినెస్ కింద 6.5 కోట్ల రేటు కి అమ్మగా ఇక్కడే సినిమాకి టేబుల్ ప్రాఫిట్ దక్కింది.

ఇక సినిమా డిజిటల్ రైట్స్ అండ్ శాటిలైట్ రైట్స్ కింద 4.2 కోట్ల రేటు ని సొంతం చేసుకోగా, డబ్బింగ్ రైట్స్ అండ్ మ్యూజిక్ రైట్స్ ద్వారా మరో కోటి దాకా బిజినెస్ ను సాధించిందట. దాంతో ఓవరాల్ గా సినిమా బిజినెస్ 11.7 కోట్ల రేటు ను సొంతం చేసుకోగా… అందులో పెట్టిన బడ్జెట్ 5 కోట్లు, పబ్లిసిటీ ఖర్చులు 50 లక్షలు కలిపినా…

5.5 కోట్ల రేటు కి సినిమా మొత్తం మీద 11.7 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుని బడ్జెట్ మీద టోటల్ గా 6.2 కోట్ల మేర ప్రాఫిట్ ను నిర్మాతలకు సొంతం చేసి పెట్టింది. కానీ ఈ సినిమా వల్ల నష్టపోయిన బయ్యర్స్ కి అనిల్ రావిపూడి అప్ కమింగ్ మూవీస్ రైట్స్ ఇస్తానని చెప్పారని టాక్ ఉంది, దాంతో బయ్యర్స్ ఇప్పుడు నష్టాలూ వచ్చినా పెద్దగా పట్టించుకోవడం లేదని సమాచారం…

Leave a Comment