న్యూస్ బాక్స్ ఆఫీస్

డిసాస్టర్ సినిమా అన్నారు 180 కోట్లు ఔట్…2019 లో మూడో హిట్!!

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మధ్య కొన్ని సినిమాలు రివ్యూ లు మౌత్ టాక్ లకి అతీతంగా అద్బుతమైన కలెక్షన్స్ ని వసూల్ చేస్తున్నాయి. కొన్ని సినిమాలు పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ రావడం లేదు కానీ కొన్ని సినిమాలు మాత్రం నెగటివ్ టాక్ తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భీభత్సం సృష్టిస్తున్నాయి. మన దగ్గరే చూసుకున్నా ఈ ఇయర్ ఇస్మార్ట్ శంకర్ మరియు డబ్ మూవీ కాంచన 3 లకు…

మిక్సుడ్ టాక్ వచ్చింది, కలెక్షన్స్ పరంగా అవి సంచలనాలు సృష్టించాయి. ఇక హిందీ లో కూడా ఈ ఇయర్ మొత్తం మీద లోవెస్ట్ రేటింగ్స్ ని టాక్ ని సొంతం చేసుకున్న సినిమా గా అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ హౌస్ ఫుల్ 4 నిలుస్తుంది అని చెప్పొచ్చు.

దీపావళి వీకెండ్ అడ్వాంటేజ్ తో రిలీజ్ అయిన ఈ సినిమా కథ పాయింట్ వేస్ట్ అని, సినిమా ఏమాత్రం బాలేదని ఓ రేంజ్ లో అన్ని వైపులా విమర్శలు రాగా అవన్నీ ఎదురుకుని సినిమా 5 రోజుల్లో 100 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా ఇప్పుడు 12 రోజులు ముగిసే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన కలెక్షన్స్ తో హోల్డ్ చేసింది.

ఏకంగా 180 కోట్ల మార్క్ ని అధిగమించి విజయం వాకిట నిలిచింది, సినిమా ను ఇండియా లో సుమారు 95 కోట్ల రేంజ్ లో అమ్మినట్లు సమాచారం, దాంతో సినిమా ఇండియా లో హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 185 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం నెలకొనగా…

మరో 5 కోట్లు వసూల్ చేస్తే క్లీన్ హిట్ కాబోతుంది, దాంతో ఈ ఇయర్ అక్షయ్ కుమార్ ఖాతాలో కేసరి, మిషన్ మంగల్ ల తర్వాత మూడో హిట్ గా ఈ సినిమా నిలిచి హాట్రిక్ ని పూర్తీ చేసుకోబోతుంది, దాంతో పాటే నెగటివ్ రివ్యూ లు ఇచ్చిన వాళ్ళకి షాక్ ఇస్తూ భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!