న్యూస్ స్పెషల్

డిసాస్టర్ సినిమా తో ఊరమాస్ రికార్డ్…బెల్లంకొండ మాస్!!

ఈ నార్త్ మూవీ లవర్స్ కి సౌత్ డబ్బింగ్ మూవీ అంటే చాలు ఎక్కడ లేని ఊపు వస్తుందేమో… హిట్ మూవీ నా ఫ్లాఫ్ మూవీ నా అన్న తేడా లేకుండా విరగబడి సౌత్ డబ్బింగ్ మూవీస్ ని ఎగబడి చూస్తున్నారు…. వాటిలో చాలా సినిమా లు సంచలన రికార్డుల తో అక్కడ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. లేటెస్ట్ గా ఇక్కడ డిసాస్టర్ మూవీ లలో ఒక సినిమా అక్కడ ఏకంగా…

200 మిలియన్ మార్క్ ని కంప్లీట్ చేసుకుని దుమ్ము లేపింది. టాలీవుడ్ లో 2014 లో అల్లుడు శీను సినిమా తో అడుగు పెట్టి క్లీన్ హిట్ ని 5 ఏళ్ల కి రీమేక్ సినిమా రాక్షసుడు తో సొంతం చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ఫ్లాఫ్ సినిమాల్లో అట్టర్ డిసాస్టర్ ఫ్లాఫ్ అయిన సినిమా…

కవచం… కాజల్ బెల్లంకొండ శ్రీనివాస్ మరియు మేహ్రీన్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా భారీ డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకోగా ఇదే సినిమా హిందీ లో డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా అక్కడ మాత్రం రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ తో మెంటల్ మాస్ రికార్డ్ ను అందుకుంది.

ఏకంగా 200 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి అక్కడ ఈ మార్క్ ని అందుకున్న అతికొద్ది సినిమాల్లో ఒకటిగా చేరి సంచలనం సృష్టించింది ఈ సినిమా. ఒక డిసాస్టర్ మూవీ తో ఈ రేంజ్ ఊచకోత అంటే మామూలు విషయం కాదు… అక్కడ ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ ఖాతాలో మూడు వరకు 100 మిలియన్ మార్క్ ని…

అందుకున్న సినిమాలు ఉన్నాయి…. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు హిట్ తర్వాత చేస్తున్న సినిమా అల్లుడు అదుర్స్ మరికొంత భాగం షూటింగ్ బాలెన్స్ ఉండగా ఈ ఏడాది చివర్లో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ సినిమాతో హిట్ ట్రాక్ ని కొనసాగిస్తాడో లేదో చూడాలి మరి…

Leave a Comment