న్యూస్ బాక్స్ ఆఫీస్

డిస్కోరాజా టోటల్ థియేటర్స్…బుకింగ్స్ రిపోర్ట్…ఫస్ట్ డే ప్రిడిక్షన్స్!

మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు, ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ వి ఐ ఆనంద్ డైరెక్షన్ లో డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ డిస్కో రాజా బాక్స్ ఆఫీస్ దగ్గర మరి కొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుంది, ఇక సినిమా ఓవరాల్ థియేటర్స్ కౌంట్, బుకింగ్స్ వివరాలు ఫస్ట్ డే ఎంత రావచ్చు అన్న అంచనాలను గమనిస్తే…

ముందుగా సినిమా ఓవరాల్ గా రిలీజ్ కి ముందు రోజు వరకు 460 కి పైగా థియేటర్స్ కన్ఫాం అవ్వగా రిలీజ్ రోజున సినిమా ఓవరాల్ థియేటర్స్ కౌంట్ ఈ విధంగా ఉండబోతుంది.
?Nizam – 220~
?Ceeded- 130
?Andhra- 290+
?AP TG: 650~
?KA & ROI: 100~
?OS: 120
Total: 870+

ఇక సినిమా ఓవరాల్ అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే సంక్రాంతి సీజన్ అయిపోయినా ఆడియన్స్ ఇంకా ఆ సినిమాల మోజులోనే ఉన్నారు, దానికి తోడూ రవితేజ లాస్ట్ 3 మూవీస్ రిజల్ట్ కూడా ఎఫెక్ట్ చూపడం తో ఈ సినిమా బుకింగ్స్ మూడు రోజుల ముందే మొదలు అయినా కానీ.. ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ 20% వరకు మాత్రమె ఉన్నాయి.

కానీ సినిమా కి రిలీజ్ కి ముందు నుండే పాజిటివ్ బజ్ ఉండటం తో మార్నింగ్ షో సమయానికి ఓవరాల్ గా 30% వరకు బుకింగ్స్ జరగవచ్చు, ఇక సినిమా టాక్ ని బట్టి షో షో కి ఇంప్రూవ్ మెంట్ ఉండటం ఖాయమని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ని బట్టి చూస్తె…

ఫస్ట్ డే 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు… టాక్ ని బట్టి గ్రోత్ ని బట్టి ఈ లెక్క డబుల్ అయ్యే అవకాశం కూడా పుష్కలంగా ఉంది… సేఫ్ సైడ్ లో ఫస్ట్ డే 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా అందుకోవచ్చని అనుకుంటున్నాం. ఇక సినిమా ఫస్ట్ డే అంచనాలను మించి వసూళ్ళ ని సాధించాలని కోరుకుందాం….

Leave a Comment