న్యూస్ రివ్యూ

డిస్కోరాజా ప్రీమియర్ షో రివ్యూ…. హిట్టా-ఫట్టా!!

మాస్ మహారాజ్ రవితేజ ఏడాది కి పైగా గ్యాప్ తీసుకుని చేసిన లేటెస్ట్ మూవీ డిస్కో రాజా… బాక్స్ ఆఫీస్ దగ్గర నేడు వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 800 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా.. ముందుగా ప్రీమియర్ షోలను పూర్తీ చేసుకోగా అక్కడ నుండి ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారగా… సినిమా కి అక్కడ రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయలేదు కానీ హీరో పై ఒక ప్రయోగం జరుగుతుంది, తర్వాత తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి… ప్రయోగం ముందు తన లైఫ్ లో ఏం జరిగింది అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా డిస్కో రాజా అంటున్నారు.

పెర్ఫార్మెన్స్ పరంగా రవితేజ దుమ్ము దులిపేశాడని, తన ఎనర్జీ డైలాగ్స్ మరో లెవల్ లో ఉంటాయని అంటున్నారు, డాన్సుల పరంగా కూడా కుమ్మేశాడని అంటున్నారు. ఓవరాల్ గా రవితేజ స్క్రీన్ పై వచ్చిన ప్రతీసారి ఆడియన్స్ ఫుల్ చార్జ్ అవుతారని అంటున్నారు.

హీరోయిన్స్ అందరిలోకి పాయల్ కి కొంచం బెటర్ రోల్ దక్కిందని అంటున్నారు. వెన్నెల కిషోర్ కామెడీ ఓకే అనిపించగా సునీల్ క్యారెక్టర్ షేడ్స్ డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు.. ఇక తమన్ సంగీతం బ్యాగ్రౌండ్ స్కోర్ మరో లెవల్ లో ఉన్నాయని అంటున్నారు.

ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్ ని మరింత పెంచేలా ఉందని చెబుతున్నారు. సినిమాటోగ్రఫీ అదిరిపోయిందని, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయని అంటున్నారు. ఇక వి ఐ ఆనంద్ డైరెక్షన్ సైన్స్ ఫిక్షన్ అంటూ కలరింగ్ ఇచ్చినా ఓ రివేంజ్ డ్రామా నే తెరకెక్కించాడని అంటున్నారు.

రవితేజ క్యారక్టర్ పరంగా తన డైరెక్షన్ ఆకట్టుకున్నా ఓవరాల్ మూవీ పరంగా అనుకున్న రేంజ్ లో తీయలేక పోయాడని అంటున్నారు. మొత్తం మీద ఫస్టాఫ్ టేక్ ఆఫ్ అవ్వడానికి కొంత టైం పట్టగా తర్వాత రేసీ గా సాగే స్క్రీన్ ప్లే… ఇంటర్వెల్ బ్యాంగ్ టైం కి…

పీక్స్ కి వెళ్ళిపోగా… మళ్ళీ సెకెండ్ ఆఫ్ లో 25 – 30 నిమిషాలు మళ్ళీ రేసీగా సాగిపోయే స్క్రీన్ ప్లే తర్వాత స్లో అవ్వడం క్లైమాక్స్ డిఫెరెంట్ గా ఉండటం తో ముగుస్తుందని అంటున్నారు. మొత్తం మీద సినిమా మరీ అద్బుతం కాదు కానీ రవితేజ కోసం ఒకసారి చూడొచ్చు అంటున్నారు.

ఫైనల్ గా సినిమా కి ప్రీమియర్ షో ల నుండి ఎబో యావరేజ్ కి అటూ ఇటూ గా టాక్ వినిపిస్తుందని చెప్పాలి. ఇక రెగ్యులర్ షోలకు ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. రవితేజ మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సీన్స్ ఉన్నాయి కానీ డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ కాబట్టి ఇక్కడ రెస్పాన్స్ ని బట్టి సినిమా ఫేట్ తేలబోతుంది అని చెప్పాలి.

Leave a Comment