న్యూస్ బాక్స్ ఆఫీస్

డిస్కోరాజా ఫస్ట్ డే ఓపెనింగ్స్….షాకింగ్ ఓపెనింగ్స్!!

మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ డిస్కోరాజా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి మరీ అనుకున్న రేంజ్ లో థియేటర్స్ దక్కలేదు… 650 థియేటర్స్ రిలీజ్ అనుకుంటే సినిమా కి కేవలం 400 థియేటర్స్ మాత్రమె దక్కాయి. దాంతో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్ డే కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్…

ఓపెనింగ్స్ విషయానికి వస్తే… రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా రిలీజ్ కి ముందు రోజు ఓవరాల్ బుకింగ్స్ 20% రేంజ్ లో ఉండగా రిలీజ్ రోజు మార్నింగ్ షో సమయానికి ఓవరాల్ గా 30% పైగా ఉన్నాయి. ఆన్ లైన్ కన్నా ఆఫ్ లైన్ బుకింగ్స్ బెటర్ గా ఉండటం విశేషం.

ఇక సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూడా బాగానే ఉండగా మొత్తం మీద మొదటి రోజు ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ని బట్టి సినిమా 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల గ్రోత్ బాగుంటుంది కాబట్టి మొత్తం మీద సినిమా..

3 కోట్ల మార్క్ ని అధిగమించడం ఖాయం… ఫస్ట్ డే 5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకుంటుంది అని ప్రిడిక్ట్ చేసినా ఇప్పుడు థియేటర్స్ తగ్గడం తో ఆ మార్క్ అందుకోవడం ప్రస్తుతానికి కష్టం అనే చెప్పాలి. సినిమా అల్టిమేట్ లెవల్ లో గ్రోత్ ని సాధిస్తే తప్పితే కష్టం..

ఇక రోజు మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ డీసెంట్ గానే ఉన్నాయి. కానీ థియేటర్స్ తగ్గడం తో ఓపెనింగ్స్ పై ఇంపాక్ట్ చూపుతుంది, ఇక సంక్రాంతి సినిమాల జోరు కూడా కొనసాగుతుంది కాబట్టి ఎంతవరకు డిస్కోరాజా రోజు ముగిసే సరికి హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సాధిస్తుందో అనేది అందరి లోను ఆసక్తిని రేపుతున్న అంశం అని చెప్పాలి.

Leave a Comment