న్యూస్ బాక్స్ ఆఫీస్

డిస్కోరాజా ఫస్ట్ డే కలెక్షన్స్…మాస్ మహారాజ్ మాస్!

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మాస్ మహారాజ్ రవితేజ తన మాస్ పవర్ ని చూపించాడు, డిస్కోరాజా సినిమా ఆన్ లైన్ టికెట్ సేల్స్ కన్నా కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ మాసివ్ గా ఉండటం విశేషం. అంటే మాస్ లో రవితేజ క్రేజ్ చెక్కు చెదరలేదు అన్నది మరోసారి క్లియర్ అయ్యింది, కానీ లిమిటెడ్ రిలీజ్ వలన మరీ అద్బుతం కాదు కానీ మంచి ఓపెనింగ్స్ ని సినిమా సొంతం చేసుకుంది.

మార్నింగ్ మ్యాట్నీ షోలతో పోల్చితే ఈవినింగ్ షోలకు 10% కి పైగా ఇంప్రూవ్ మెంట్ ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో జరగగా ఆఫ్ లైన్ బుకింగ్స్ 15% తో 20% వరకు ఇంప్రూవ్ అయ్యాయని రిపోర్ట్స్ అందుతున్నాయి. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొదటి రోజు ఇప్పుడు…

రెండు తెలుగు రాష్ట్రాలలో 3.2 కోట్ల నుండి 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పూర్తీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్నీ అనుకున్నట్లు ఉంటె సినిమా మొత్తం మీద 3.8 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 4.2 కోట్ల నుండి 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద చూసుకుంటే 20 కోట్ల టార్గెట్ ని అందుకునే క్రమం లో ఇవి మంచి ఓపెనింగ్స్ గా చెప్పుకోవచ్చు. కానీ ఓవరాల్ ఆడియన్స్ రెస్పాన్స్ మాత్రం కొంచం మిక్సుడ్ గా ఉంది.

దాన్ని అధిగమించి సినిమా వీకెండ్ లో ఇదే రేంజ్ లో గ్రోత్ ని కంటిన్యు చేస్తే బ్రేక్ ఈవెన్ అవ్వడం పెద్ద కష్టం కాదు కానీ సినిమా ఎంతవరకు హోల్డ్ చేస్తుంది అన్నది అనుమానాస్పదం అనే చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్స్ అఫీషియల్ గా ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment