న్యూస్ బాక్స్ ఆఫీస్

డే 11 కుమ్మింది….హౌస్ ఫుల్స్…11 డేస్ టోటల్ కలెక్షన్స్!!

యాక్షన్ హీరో గోపీచంద్ తమన్నా ల కాంబినేషన్ లో సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కోసం కష్టపడుతుంది, సినిమా తెలుగు రాష్ట్రాలలో సూపర్ స్ట్రాంగ్ ఓపెనింగ్స్ తో ఓపెన్ అయ్యి దుమ్ము లేపినా తర్వాత పరిస్థితులు మారిపోయి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కోసం కష్టపడుతున్న ఈ సినిమా మొత్తం మీద మొదటి వారం పూర్తీ చేసుకున్న తర్వాత రెండో వీక్ లో…

భారీ థియేటర్స్ నే హోల్డ్ చేసినా కానీ వీకెండ్ కలెక్షన్స్ అంతంత మాత్రమె వచ్చాయి. అయినా కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమా 10 వ రోజు 34 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా 11 వ రోజు వర్కింగ్ డే అవ్వడంతో…

ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా అందరినీ ఆశ్యర్య పరుస్తూ 11 వ రోజు సినిమా 10 వ రోజు తో పోల్చితే కేవలం 11 లక్షలు మాత్రమె డ్రాప్స్ ను సొంతం చేసుకుని 23 లక్షల షేర్ సాధించింది. వర్కింగ్ డే అయినా కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడటం విశేషం… వినాయక నిమజ్జనం అయిపోవడంతో ఈ వీక్ లో చూడని వాళ్ళు థియేటర్స్ తరలి వెళ్లారు…

దాంతో అది కలెక్షన్స్ పై బాగానే ఇంపాక్ట్ చూపింది. మొత్తం మీద సినిమా ఇప్పుడు 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.56Cr
👉Ceeded: 1.83Cr
👉UA: 1.30Cr
👉East: 98L
👉West: 59L
👉Guntur: 1.04Cr
👉Krishna: 57L
👉Nellore: 49L
Total AP TG: 9.36CR(15.62CR~ Gross)
👉KA+ROI: 36L
👉OS: 8L~(No release in USA)
TOTAL Collections: 9.80CR(16.65CR~ Gross)

ఇదీ మొత్తం మీద సినిమా 11రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్… 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఓవరాల్ గా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మరో 2.2 కోట్ల షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో సినిమా బాక్స్ ఆఫీస్ ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Comment