న్యూస్

డే 2…KGF2- 33M….రాధే శ్యామ్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ సినిమా అఫీషియల్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా టీసర్ ఫస్ట్ 24 గంటల్లో ఊహకందని వ్యూస్ తో టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేసి ఊచకోత కోసింది… తర్వాత కూడా జోరు ఏమాత్రం తగ్గకుండా ఫుల్ జోష్ తో దుమ్ము లేపిన ఈ టీసర్ టాలీవుడ్ తరుపున ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ రికార్డ్ హోల్డర్ గా నిలవగా…

తర్వాత కూడా జోరు తగ్గకుండా ఫాస్టెస్ట్ 60 మిలియన్ వ్యూస్ మార్క్ ని కూడా అందుకుంది… ఇక తర్వాత వ్యూస్ కొన్నింటినీ యూట్యూబ్ తగ్గించగా తర్వాత టీసర్ స్లో డౌన్ అయింది. అయినా కానీ రెండో రోజు కూడా రికార్డ్ లెవల్ లో వ్యూస్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది.

ఇండియా లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీసర్ లలో రెండో రోజు మొత్తం మీద హైయెస్ట్ వ్యూస్ ని KGF చాప్టర్ 2 టీసర్ సొంతం చేసుకుంది. రెండో రోజు మొత్తం మీద 33 మిలియన్స్ వరకు వ్యూస్ ని సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేయగా…

రాధే శ్యామ్ టీసర్ ఒక దశలో ఈ రికార్డ్ ను అందుకునే రేంజ్ లో స్పీడ్ చూపినా తర్వాత స్లో డౌన్ అవ్వడంతో మొత్తం మీద 24 గంటల్లో KGF చాప్టర్ 2 టీసర్ ను అందుకొక పోయినా పోటి ఇచ్చిన టీసర్ గా మైండ్ బ్లాంక్ అయ్యే ఓవరాల్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద రెండో రోజు 19.5 మిలియన్స్ వరకు వ్యూస్ ని…

రెండో రోజు సొంతం చేసుకుంది ఈ టీసర్… టాలీవుడ్ లో చాలా సినిమాలకు మొదటి రోజు వచ్చే వ్యూస్ లెక్క ఇది. అలాంటిది రెండో రోజు ఈ రేంజ్ వ్యూస్ ని అందుకోవడం విశేషం, యూట్యూబ్ 1.39 మిలియన్ వ్యూస్ ని తొలగించకుండా ఉంటే ఈ లెక్క ఇంకా ఎక్కువగా ఉండి ఉండేదని చెప్పాలి… ఇక లాంగ్ రన్ లో ఈ టీసర్ వ్యూస్ పరంగా ఇంకా ఎన్ని రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.

Leave a Comment