గాసిప్స్ న్యూస్

ఢీ సీక్వెల్….షాకింగ్ నిర్ణయం తీసుకున్న శ్రీనువైట్ల!!

ఒకప్పుడు టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్న శ్రీనువైట్ల ఆగడు, బ్రూస్ లీ సినిమాలు భారీ డిసాస్టర్లు అవ్వగా తన మార్కెట్ పూర్తిగా పడిపోయింది.ఇలాంటి టైం లోనే తన టీం తో గొడవల వలన మరింత డీలా పడిన శ్రీనువైట్ల తర్వాత చేసిన మిస్టర్ కానీ, అమర్ అక్బర్ ఆంథోని కానీ అత్యంత భారీ డిసాస్టర్ మూవీస్ లో నిలిచి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాయి. దాంతో రెండేళ్లుగా ఖాళీగా ఉంటున్న శ్రీనువైట్ల…

ఎలాగైనా ఓ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అవ్వగా తన కెరీర్ టర్నింగ్ పాయింట్స్ లో ముందు నిలిచే ఢీ సినిమా కి సీక్వెల్ గా ఢీ 2 డేరింగ్ అండ్ డాషింగ్ అంటూ సరికొత్త సినిమా ను మొదలు పెట్టె పనిలో ఉన్నాడు. ఇక ఈ సినిమా కోసం…

విడిపోయిన తన టీం తో కూడా కలవబోతున్నాడు శ్రీను వైట్ల, మంచు విష్ణు హీరోగా నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమా సీక్బెల్ లో ఇప్పుడు ఢీ సినిమాలో ముఖ్యమైన ఛారీ పాత్రను మళ్ళీ బ్రహ్మానందం తోనే వేయిస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారగా… ఇప్పుడు బ్రహ్మీ పెద్దగా సినిమాలు చేయకపోవడంతో…

బ్రహ్మీ ప్లేస్ లో టాలీవుడ్ ప్రజెంట్ హ్యాపెనింగ్ కామెడీ స్టార్ అయిన వెన్నెల కిషోర్ కి ఫుల్ లెంత్ ఛారీ రోల్ ని ఇవ్వబోతున్నారని సమాచారం. వెన్నెల కిషోర్ పై అల్టిమేట్ కామెడీ సీన్స్ ని రాసుకున్నారని తెలుస్తుంది. మంచు విష్ణు మూవీస్ లో వెన్నెల కిషోర్ కి రెగ్యులర్ గా రోల్స్ కచ్చితంగా ఉంటూ వస్తాయి.

అది కూడా దృష్టి లో పెట్టుకుని ఈ సారి ఛారీ రోల్ లో వెన్నెల కిషోర్ కనిపిస్తారని అంటున్నారు. స్క్రిప్ట్ వర్క్ ఆల్ మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చిందట. త్వరలోనే సినిమాను మంచి డేట్ చూసుకుని మొదలు పెట్టి వచ్చే ఇయర్ సమ్మర్ రేసులో నిలిపే అవకాశం ఎంతైనా ఉందనేది టాలీవుడ్ టాక్.మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి…

Leave a Comment