న్యూస్ బాక్స్ ఆఫీస్

తమిళనాడులో థియేటర్స్ ఓపెన్…ఆ 2 సినిమాల కలెక్షన్స్ ఇవే!!

దాదాపు 8 నెలల నుండి మూసేసి ఉన్న థియేటర్స్ ఇండియా లో కొన్ని చోట్ల తెరచుకోగా ఇంకా చాలా చోట్ల తెరచుకోవాల్సి ఉంది, ఇక తెరచుకున్న చోట కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి జనాలను థియేటర్స్ కి రప్పిస్తున్నా కానీ చాలా వరకు పాత సినిమాలతోనే థియేటర్స్ ని నడిపిస్తున్నారు థియేటర్స్ ఓనర్లు. ఇక పక్క రాష్ట్రం తమిళనాడులో మాత్రం థియేటర్స్ ని రీ ఓపెన్ చేయడం కొత్త సినిమాలతో ఓపెన్ చేయడం విశేషం.

ఈ దీపావళి కి అక్కడ థియేటర్స్ రీ ఓపెన్ అవ్వడం 2 కొత్త సినిమాలతో ఓపెన్ అయింది, ఒకటి కమెడియన్ సంతానం నటించిన బిస్కోత్ సినిమా కాగా మరోటి అడల్ట్ మూవీ చీకటిగదిలో చితక్కొట్టుడు తమిళ్ ఒరిజినల్ సినిమా కి ఇరాందం కుత్తు సినిమా….

ఈ రెండు సినిమాలు దీపావళి వీకెండ్ లో ఆల్ మోస్ట్ 550 వరకు థియేటర్స్ లో తమిళనాడు మొత్తం మీద 50% ఆక్యుపెన్సీ తో రిలీజ్ అవ్వగా మొదటి రోజు చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి, వీకెండ్ కూడా మంచి ఆక్యుపెన్సీ తో రన్ కూడా అవ్వగా తర్వాత వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయ్యాయట.

సినిమాలకు మరీ టాక్ పాజిటివ్ గా లేకపోవడం వలన ఇది జరిగింది అంటున్నారు, మొత్తం మీద ఇప్పటి వరకు సంతానం సినిమా బిస్కోత్ అక్కడ 1.2 కోట్ల దాకా కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని అంటున్నారు. ఇక చీకటిగదిలో చితక్కొట్టుడు తమిళ్ ఒరిజినల్ సినిమా కి ఇరాందం కుత్తు సినిమా ఆల్ మోస్ట్ 1.6 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది అంటున్నారు.

ఇవీ పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ అనే చెప్పాలి. దీపావళి వీకెండ్ లో బాగానే కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమాలు 50% ఆక్యుపెన్సీ తోనే పర్వాలేదు అనిపించగా లాంగ్ రన్ లో ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటాయి అన్నది ఆసక్తిగా మారగా టాలీవుడ్ లో మళ్ళీ బాక్స్ ఆఫీస్ రేస్ త్వరలో మొదలు కాబోతుంది అని చెప్పాలి.

Leave a Comment