న్యూస్ బాక్స్ ఆఫీస్

తమిళనాడులో థియేటర్స్ రీ ఓపెన్….హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి!!

బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి నెలలు గడుస్తుంది, సమ్మర్ కన్నా ముందు కరోనా ఎంటర్ అవ్వడం తో ఇండియా మొత్తం మీద అన్ని ఇండస్ట్రీ లలో కొత్త సినిమాలు ఏవి కూడా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోలేక రిలీజ్ లను పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాయి. కొన్ని సినిమాలు ఎదురు చూపులను ఇంకా కొనసాగిస్తూ ఉండగా కొన్ని సినిమాలు ఆగలేక డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్నాయి.

అలాంటి వాటిలో ఎక్కువ సినిమాలే ఉండగా థియేటర్స్ ని రీ ఓపెన్ చేసుకోవచ్చు అన్న నిర్ణయం తీసుకున్నా కానీ కొత్త సినిమాలు ఏవి కూడా రిలీజ్ కాలేదు, కానీ ఎట్టకేలకు రీసెంట్ గా దీపావళి కానుకగా తమిళ్ లో థియేటర్స్ ని రీ ఓపెన్ చేయగా…

కొత్త సినిమాలు 2 ఆడియన్స్ ముందుకు వచ్చాయి. సంతానం నటించిన కొత్త సినిమా బిస్కోత్ సినిమా అలాగే చీకటిగదిలో చితక్కొట్టుడు తమిళ్ ఒరిజినల్ సినిమా కి ఇరాందం కుత్తు సినిమా కూడా దీపావళి కి థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు 50% ఆక్యుపెన్సీ తో రిలీజ్ అవ్వగా…

చాలా చోట్ల సినిమాలకు హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి…. 50% ఆక్యుపెన్సీ తో హౌస్ ఫుల్ బోర్డ్స్ పడటం, అది కూడా పండగ టైం లో జనాలు బయటికి వచ్చి సినిమాలను థియేటర్స్ లో చూడటానికి ఇంట్రెస్ట్ చూపుతూ ఉండటం తో ఇది శుభ సూచకం అనే చెప్పాలి. కానీ 50% ఆక్యుపెన్సీ తో థియేటర్ ఓనర్స్ కి పెద్దగా ఒడిగేది ఏమి ఉండదు కానీ…

పరిస్థితులు నార్మల్ అయ్యే వరకు ఇది ఇలానే కొనసాగితే డిసెంబర్ జనవరి నాటికి జనాలు మరింత ఎక్కువగా థియేటర్స్ కి తరలి వచ్చే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలలో దీపావళి కి కూడా థియేటర్స్ ని రీ ఓపెన్ చేయలేదు, డిసెంబర్ మొదటి వారం నుండి థియేటర్స్ ని తెరుస్తారు అంటున్నారు…మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి మరి.

Leave a Comment