గాసిప్స్ న్యూస్

తమిళ్ – తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ…బాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ రీమేక్!!

రీసెంట్ టైం లో బాలీవుడ్ లో సౌత్ రీమేక్ లు మరీ ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే, టెంపర్, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు అక్కడ రీమేక్ అయ్యి భారీ విజయాలను సొంతం చేసుకోవడం తో మరిన్ని సినిమాల రీమేక్ లకు రంగం సిద్ధం చేస్తున్నారు బాలీవుడ్ నిర్మాతలు. ఈ క్రమం లో మరిన్ని సౌత్ రీమేక్ లు అక్కడ ఒక్కోటి గా కన్ఫాం అవుతుండగా ఇప్పుడు మరో క్రేజీ సినిమా అక్కడ…

రీమేక్ కి సిద్ధం అవుతుంది. ముందుగా తమిళ్ లో రూపొంది అక్కడ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి తర్వాత తెలుగు లో రీమేక్ అయ్యి ఇక్కడ కూడా స్లో గా స్టార్ట్ అయ్యి లాంగ్ రన్ ని సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ…

రాక్షసుడు సినిమా ఇప్పుడు అక్కడ రీమేక్ కి సిద్ధం అవుతుంది. కాగా ఈ సినిమా అక్కడ లేటెస్ట్ సెన్సేషన్…. వరుసగా 7 హిట్లు కొట్టిన సెన్సేషనల్ స్టార్ ఆయుష్ మాన్ ఖురానా రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. దాంతో బాలీవుడ్ మొత్తం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సౌత్ లోనే కాదు రీసెంట్ టైం లో ఇండియా లో రూపొందిన ది బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్స్ లో ముందు నిలిచే సినిమా రాక్షసుడు… టైట్ స్క్రీన్ ప్లే సాగే ఈ సినిమా అక్కడ కూడా ఆకట్టుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ చేస్తూ అక్కడ వరుస విజయాలతో దుమ్ము లేపుతున్నాడు ఆయుష్ మాన్ ఖురానా…

ప్రస్తుతం వేరే సినిమాలో బిజీ గా ఉన్న ఈ హీరో వచ్చే ఇయర్ లో ఈ సినిమా ను మొదలు పెట్టి ఇయర్ సెకెండ్ ఆఫ్ లో రిలీజ్ చేయాలనే ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకు పోతున్న ఈ హీరో ఇప్పుడు ఈ రీమేక్ తో మరో సెన్సేషనల్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడం ఆల్ మోస్ట్ కన్ఫాం అనే చెప్పాలి.

Leave a Comment