గాసిప్స్ న్యూస్

తమిళ్ లో 10 కోట్లు కానీ తెలుగు సినిమాకి శివ కార్తికేయన్ రికార్డ్ రెమ్యునరేషన్…ఎంతంటే!!

తెలుగు లో నిర్మాతలు మరీ ఎక్కువ అవ్వడం వలన కావొచ్చు లేక హీరోలతో సినిమాలు తీయడానికి క్యూలు కట్టాల్సిన అవసరం ఏర్పడటం కావొచ్చు, నిర్మాతలు డైరెక్టర్ లు అందరూ స్టార్ హీరోలతో వరుస పెట్టి సినిమాలు తీయడం కుదరదు కాబట్టి ఈ గ్యాప్ లో బైలింగువల్ సినిమాలు తీయడం బెటర్ అని ఫిక్స్ అవుతున్న కొందరు డైరెక్టర్స్ ఇప్పుడు వరుస పెట్టి తమిళ్ హీరోలను తెలుగు కి తీసుకు వస్తూ కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు.

ఇప్పటికే తెలుగు లో స్ట్రైట్ మూవీస్ ని కమిట్ అయిన హీరోలుగా విజయ్, ధనుష్, సూర్య లు నిలవగా ఇప్పుడు వీళ్ళకి తోడూ మరో హీరో కూడా తెలుగు లో స్ట్రైట్ మూవీ కి సిద్ధం అవుతున్నాడు. తమిళ్ లో ఎలాంటి స్టార్ బ్యాగ్రౌండ్ లేకుండా ఒక్కో స్టెప్ ఎదిగిన…

నటుడు శివ కార్తికేయన్ సినిమాలు అడపాదడపా తెలుగు లోకి కూడా వచ్చాయి కానీ పెద్దగా ఏవి ఇంకా హిట్ గీత దాటలేదు. కానీ ఈ హీరోకి తమిళ్ లో టాప్ 5 హీరోల్లో ఒకరిగా చోటు ఉండగా అవలీలగా 35 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని అక్కడ అందుకునే కెపాసిటీ ఉంది.

అలాంటి ఈ హీరో ని ఇప్పుడు తెలుగు కి తీసుకు వస్తుండగా భారీ రెమ్యునరేషన్ ని ఇచ్చి మరి రప్పిస్తున్నట్లు తెలుస్తుంది. ఇతర హీరోలతో పోల్చితే ఇంకా ఇక్కడ మార్కెట్ అంతగా లేక పోయినా కానీ ఏకంగా 20 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి శివ కార్తికేయన్ ని తెలుగు లోకి తీసుకు రాబోతున్నారట. త్వరలోనే డైరెక్టర్ అండ్ మూవీ ని అనౌన్స్ చేస్తారని అంటున్నారు.

ఇక్కడ టాప్ స్టార్స్ తీసుకునే రెమ్యునరేషన్ ని ఇస్తూ తెలుగు తమిళ్ లో బైలింగువల్ మూవీస్ ని తీసి తర్వాత కన్నడ లో మరియు మలయాళంలో కూడా డబ్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంత రిస్క్ తీసుకుంటున్నారని చెప్పొచ్చు. కోలివుడ్ లో ఒక్కో సినిమాకి 8-10 కోట్ల రేంజ్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోకి ఇది జాక్ పాట్ అనే చెప్పాలి.

Leave a Comment